ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి మార్చి 18 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట తహాశీల్దారు కార్యాలయం లో ఎన్నికల నియమావళి అమలు లోకి వచ్చిన సందర్భంగా మండల స్థాయి అధికారులతో తహశీల్దారు రాఘవేంద్ర రావు సమావేశం ఏర్పాటు చేసినారు.సోమవారం రోజున ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యిన సందర్భంగా తేదీ 16 నుండి ఎన్నికల నియమావళి అమలు లోకి వచ్చింది.ప్రభుత్వ అధికారులు అందరూ కూడా ఎన్నికల కమిషన్ పరిధిలోనే పనించేయ వలసి ఉంటుంది.కావున నియమావళి అమలు పరుచ వలసిన బాధ్యత అందరూ ప్రభుత్వ అధికారులపై ఉన్నది.నియమావళి అమలులోకి బ్వచ్చున 24 గంటలలోపే ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటిలో ఏ నాయకుల ఫోటోలు కానీ ప్రభుత్వానికి సంబంధించిన పోస్టర్లు కానీ ఉండకూడదు.48 గంటలలో పబ్లిక్ ప్లేసెస్ లో కూడా ఎటువంటి పార్టీ సంబధిత పోస్టర్లు పార్టీల సామగ్రి ఉండకూడదు మరియు 72 గంటలలో ప్రైవేట్ ఆస్తుల పైన కూడా ఎటువంటి రాజకీయ పోస్టర్లు కానీ రాతలు కానీ ఉండకూడదు ఒకవేళ ఉంటే ఆ ఇంటి యజమాని అనుమతి తీసుకున్నారా చూడవలసి ఉంటుంది.ఒక వేళ అనుమతి లేనట్లయితే వెంటనే కేసు నమోదు చేయవలెను.ప్రజలు కూడా ఎవ్వరూ రూపాయలు యాభై వేల కంటే ఎక్కున నగదు ను తీసుకొని ఎక్కడికి వెళ్ళరాదు.ఒకవేళ వెళ్ళవలసి వస్తే తగు పాత్రలు చుపెట్టవలిసి ఉంటుంది.ఎటువంటి ఎన్నికల ప్రచారం చేయవలసి ఉన్న కానీ తగు అనుమతులు తీసుకోవాలని కొరణయినది. కావున మండల ప్రజలు అందరూ సహకరించ వలసిందిగా కోరణయినది.ఈ సమావేశం లో పోలీస్ శాఖ నుండి స్థానిక ఎస్సై చంద్ర కుమార్ మండల అభివృద్ధి అధికారిని సరోజ,మునిసిపాలిటీ కమిషనర్ కే.రాజశేఖర్,మండల విద్య అధికారి కె రవీందర్, ట్రాన్స్కో ఇంజనీర్ ఇ.గణేష్ ఏపియమ్ లక్ష్మి,ఏపివో వెంకట రమణ హాజరు తదితరులు పాల్గొన్నారు.