మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ప్రతినిధి (ప్రజాబలం) సెప్టెంబర్1:
సెప్టెంబర్ 2, 2023 మరియు సెప్టెంబర్ 3, 2023 తేదీలలో ఎలక్షన్ స్పెషల్ క్యాంపెన్ డే సందర్బంగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో గల 5 అసెంబ్లీ నియోజక వర్గ పరిధిలో గల అన్ని గ్రామాలలో వున్నా పోలింగ్ స్టేషన్ కేంద్రాల పరిధిలో ఓటరు నమోదు కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని, బూత్ లెవెల్ ఆఫీసర్స్ అందరు తమ తమ పోలింగ్ స్టేషన్ కేంద్ర పరిధిలో అందుబాటు ఉంటారని, తేదీ. 01.10.2023.నాటికి (18) సంవత్సరాలు నిండిన యువతి/ యువకులు తమ ఓటు హక్కు కొరకై ఫారం-6 నందు నమోదు చేసుకోవాలనిది గా విస్తృతంగా ప్రచారం చేసి, ప్రజలకు అవగాహనా కల్పించి, ఓటర్ లిస్ట్ నందు మార్పుల- చేర్పుల కొరకై ఫారం.7 & 8 ఓటర్ నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. ప్రజలు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగపరచు కోగలరని జిల్లా ఎలక్షన్ అధికారి శ్రీ డి. అమోయ్ కుమార్ గారు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.