విశాఖపట్నం సెప్టెంబర్ 1 (); విజయనగరం జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా బంగారు దేవుడు నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ జాతీయ బీసీ సంక్షేమ సంఘం యవజన విభాగం అధ్యక్షుడు రాయుడు రాకేష్ (కాక) నియమితులైనారు.జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు రాజ్యసభ సభ్యులు ఆర్ కృష్ణయ్య ఆదేశాలతో పంపిన నియమక పత్రాన్ని విశాఖపట్నం జాతీయ బీసీ సంక్షేమ సంఘం కార్యాలయం బీచ్ రోడ్లో జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధికార ప్రతినిధి ఢిల్లీ ఇన్చార్జి కర్రి వేణుమాధవ్ బీసీ నాయకులు సమక్షంలో బంగారు దేవుడికి అందజేశారు. ఈ సందర్భంగా కర్రి వేణుమాధవ్ మాట్లాడుతూ చట్టసభల్లో బీసీల రిజర్వేషన్లను కోసం కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కోసం సమగ్ర కులగణనలో బీసీ కులగణన జరగాలని జాతీయస్థాయిలో రాజ్యసభ సభ్యులు జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీ ఆర్ కృష్ణయ్య గత 50 సంవత్సరాలుగా ఉద్యమాలు చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీల దళపతి ఆర్ కృష్ణయ్య అన్న నువ్వు ఇంకా చేసిన ఉద్యమం పార్లమెంట్లో చేయి దానికి సంపూర్ణ మద్దతు ఉంటుందని పార్లమెంటుకు పంపి ఈ కార్యక్రమాల్ని ముందుకు తీసుకెళుతున్నారని అన్నారు. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో ఉన్న బీసీ పెద్దలందరినీ కలుపుకొని జిల్లా బీసీ యువజన సంఘం అధ్యక్షుడిగా కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్లాలని కర్రి వేణుమాధవ్ సూచించారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి చినబాబు విశాఖ జిల్లా కార్యదర్శి చిట్టూరి సర్వేశ్వరరావు (తాతాజీ )బిసి నాయకులు పెదగాడ ప్రసాద్కడలి సత్య కామేశ్వరరావు పట్నాల పరమేశ్వరరావు,కే. జనార్దన్ కే. శేఖర్, వి. రాజు,వై. ధామ ,ఏ.సంతోష్ సిహెచ్. సురేష్ పాల్గొన్నారు