ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా:
శిక్షణకు హాజరుకానట్లయితే ఆర్పీఏ ప్రకారం చర్యలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్,
రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని పీవోలు, ఏపీవోల, ఓపీవోలు, మైక్రో అబ్జర్వర్లకు నిర్వహించే ఎన్నికల శిక్షణ కార్యక్రమాన్ని తప్పకుండా హాజరు కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ తెలిపారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ… ఈనెల 4,5వ తేదీల్లో 2,877 పీవోలకు, ఏపీవోలకు, 2,877, ఓ పి ఓ లు , 5754, మైక్రో పరిశీలకులకు 520 మంది అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో రిటర్నింగ్ ఆఫీసర్, DLMTs, ACLMTs, సెక్టోరియల్ ఆఫీసర్ల ద్వారా శిక్షణనివ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో అధికారులకు జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజీలో, మేడ్చల్ నియోజకవర్గ అధికారులకు బోగారంలోని హోలిమేరీ ఇంజనీరింగ్ కాలేజీ, కుత్భుల్లాపూర్ నియోజకవర్గం అధికారులకు అల్వాల్లోని లయోలా కాలేజీలో, మల్కాజిగిరి నియోజకవర్గం అధికారులకు సైనిక్పురిలోని భవంత్ కాలేజీలో, ఉప్పల్ నియోజకవర్గం అధికారులకు రామంతాపూర్లోని జవహార్లాల్ నెహ్రూ పాలిటెక్నిక్ కాలేజీలో నోడల్ అధికారులు దేవసహాయం, కేశూరామ్లు శిక్షణణిస్తారని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వివరించారు. ఈ శిక్షణ కార్యక్రమానికి పీవోలు, ఏపీవోలు అందరు తప్పకుండా హాజరు కావాలని… లేనట్లయితే ఆర్పీఏ ప్రకారంచర్యలు తీసుకుంటామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ సూచించారు.