అత్యధిక ప్రజల కలిగిన ప్రజలకు ముఖ్యమంత్రి పదవితో పాటు సంక్షేమ పథకాలను అందరికీ అందించేడమే లక్ష్యంగా ప్రజాబంధు పార్టీ ని స్థాపించినట్లు ఆ పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేపాల శ్రీనివాస్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో పార్టీ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలను మేల్కొల్పి డప్పులపై ప్రజా బంధు పార్టీ అంటూ ప్రదర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 గడిచినా అత్యధిక ప్రజలకు అన్యాయం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. సమాజంలో సగభాగమైన మహిళలకు సైతం తీరని అన్యాయం చేస్తున్నారని విచారం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికి సమాన అవకాశాలు సమన్యాయము అనే ఉన్నత లక్ష్యంతో ఏర్పాటు చేసిన తమ పార్టీని జిల్లా మండల గ్రామీణ స్థాయి వరకు తీసుకువెళ్తామని అన్నారు. రాబోవు సాధారణ ఎన్నికలలో 119 స్థానాల నుంచి పోటీ చేస్తామని తెలిపారు.