సోమాజిగూడా
పరిశ్రమల్లో తెలంగాణ బిడ్డ అంటరానివాడిగా, ఆంధ్రా పాలకుల చేతుల్లో తీవ్ర నిర్లక్ష్యానికి, వివక్షకు గురవుతున్న పరిస్థితుల్లో తెలంగాణ బిడ్డల దయనీయ స్థితిని మార్చి వారికి న్యాయం చేయాలని 2006లో ప్రైవేట్ రంగ పరిశ్రమల్లో ఈ తెలంగాణ గడ్డపై పుట్టిన ప్రతి బిడ్డకు తెలంగాణ పిల్లలకు 75 శాతం స్థానిక రిజర్వేషన్లు సాధించాలనే లక్ష్యంతో రాష్ట్రంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్‌ను ఏర్పాటు చేశామని అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు సామా వెంకట్ రెడ్డి ,అధ్యక్షుడు నాగేశ్వరరావు లు తెలిపారు. సోమవారం సోమాజిగూడా ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ పోలీసు కేసులు, కంపెనీ మేనేజ్‌మెంట్ బెదిరింపులను తట్టుకుని, అనేక ధర్నాలు, రాస్తారోక్‌లు, నరబలిదానాలు చేస్తూ సార్వత్రిక సమ్మె, మిలియన్ మార్చ్ విజయవంతం చేయడంలో చాలా చురుకైన పాత్ర పోషించామని అన్నారు. ప్రత్యేక రాష్ట్రం వస్తే తెలంగాణ బిడ్డల బతుకులు మారుతాయని మందాడి యాది రెడ్డి ఢిల్లీలో పార్లమెంట్ సాక్షిగా ఆత్మబలిదానం చేసుకున్నాడని గుర్తు చేశారు. 75 శాతం స్థానిక రిజర్వేషన్ బిల్లుకు రెండేండ్ల ప్రభుత్వం మొండిచేయి చూపుతున్న తరుణంలో, అత్యంత గౌరవప్రదమైన పదవి ఇచ్చినప్పటికీ వారి నిర్లక్ష్య వైఖరికి నిరసనగా తెరాసకు అనుబంధంగా ఉన్న తమ సంఘం మద్దతు ఉపసంహరించుకుందని అన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చడం లో కేంద్రంలో ని బీజేపీ పార్టీ కూడా విఫలం చెందింది అని అందుకు నిరసనగా పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు సామా వెంకట్ రెడ్డి తెలిపారు. రాజకీయ పార్టీలకు అతీతంగా తెలంగాణ ప్రైవేట్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కుటుంబ సభ్యులు 75 శాతం స్థానిక రిజర్వేషన్ చట్టం ను తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలులో కి తేవాలని డిమాండ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను సాదించుకునెందుకు అన్ని పార్టీలపై ఒత్తిడి తెచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ,దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకపోతే రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని వారు అన్నారు.
75 శాతం స్థానిక రిజర్వేషన్ చట్టం రూపకల్పన చేయడమే తమ అంతిమ లక్ష్యం అని ఈ లక్ష్యం కోసం పదవులు, అధికారం, రాజకీయ పార్టీలకి అతీతంగా పోరాటం చేస్తామని చెప్పారు. సమావేశంలో నాయకులు శ్రీనివాస్ గులారి తదితరులు హాజరయ్యారు.