ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02 : ఆశా వర్కర్లను ప్రభుత్వం వెంటనే గుర్తించి వారికి సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఎమ్మార్వో కార్యాలయం ముందు నిరసన సమ్మెలో పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు ఎండి ఆరిఫ్ మాట్లాడుతూ…ఆశ వర్కర్లను ప్రభుత్వం రెగ్యులరైజ్ చేసి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని అన్నారు.గ్రామాలలో ఆశ వర్కర్ల సేవలు వెలకట్టలేని అని అన్నారు.ఆశా వర్కర్లు చేస్తున్న సమ్మెకు కాంగ్రెస్ ఎప్పుడు కాంగ్రెస్ మద్దతుగా ఉంటుందన్నారు.రాబోయే ఎలక్షన్లలో కాంగ్రెస్ విజయ కేతనం ఎగరవేసి చిరు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం చెల్లించి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎస్సీ సెల్ అధ్యక్షుడు గుత్తికొండ శ్రీధర్, మూల లచ్చన్న,మూల కిషన్,రాజు,చంద్రమౌళి, నవాబ్,ఖాన్,షఫీ,ఆశా,కార్యకర్తలు నాయకులు తదితరులు పాల్గొన్నారు.