ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి అక్టోబర్ 02 : గాంధీజీ సత్యం,అహింస మార్గమే నేటికి ఆదర్శం జిల్లా అదనపు కలెక్టర్ రాహుల్ అన్నారు.సోమవారం పట్టణంలోని సబ్ జైల్ లో గాంధీ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ…దేశానికి స్వాతంత్య్రం తీసుకురావడంలో గాంధీ పాత్ర మరువలేనిదన్నారు. గాంధీజీ సత్యం,అహింస మార్గమే నేటికి ఆదర్శం,అహింసను ఆయుధంగా చేసుకుని ఎన్నో ఉద్యమాల ద్వారా దేశ ప్రజలను స్వాతంత్య్రం కోసం ముందుకు నడిపిన మహనీయుడని కొనియాడారు.క్షణికవేశంలో తప్పులు చేసి జైలు జీవితం అనుభవించడం బాధాకరమన్నారు.కోపాన్ని అదుపులో ఉంచుకుని నేరాలకు దూరంగా ఉండాలని ఖైదీలకు సూచించారు.ముఖ్యంగా యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి నేరాలకు పాల్పడటం తరచుగా జరుగుతుందన్నారు.జైలు జీవితం ద్వారా పరివర్తన మంచి చెంది సమాజంలో మంచి పౌరులుగా రాణించాలన్నారు. అంతకుముందు తహసీల్దార్ రాఘవేంద్ర రావు మాట్లాడుతూ…తప్పులు చేయడం మానవ సహజమని,జైలు నుంచి విడుదల అయిన తర్వాత మంచిగా మారి తమ కుటుంబాలతో మంచిగా బ్రతుకుతూ,సమాజానికి మంచి చేయాలని కోరారు. అంతకుముందు సీ ఐ కృష్ణ మాట్లాడుతూ…నేరాలు చేయడం ద్వారా ఎన్నో కుటుంబాలు చిన్నాభిన్నాం అవుతాయని,నేరం చేసి ఇబ్బందులు పడవద్దని హితవు పలికారు.ఒకసారి పోలీస్ కేసు నమోదు అయితే ప్రభుత్వ ఉద్యోగానికి అనర్హులు అవుతారని,నేరాలు జరుగుతున్న తీరును,వాటి పరిణామాలను వివరించారు. అనంతరం సబ్ జైలర్ స్వామి మాట్లాడుతూ… జైలులో ఖైదీలకు యోగ, ధ్యానం క్రమం తప్పకుండా నేర్పిస్తున్నట్లు వారిలో సత్ప్రవర్తన కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. నిబంధనలు మేరకు ఆహరం,ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్లు వివరించారు. అదే విధంగా జైళ్ళ శాఖ ఆధ్వర్యంలో ఖైదీలలో మంచి పరివర్తన కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాల గురించి వివరించారు.అనంతరం పలువురు ఖైదీలు యోగాసనాలు వేసి అబ్బురపరిచారు.పోటీల్లో గెలుపొందిన ఖైదీలకు కార్యక్రమ అతిధులు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమీషనర్ కల్లెడ రాజశేఖర్, మేనేజర్ శ్రీహరి,జైలు అధికారులు సప్ప రాములు, శంకర్, సిబ్బంది పాల్గొన్నారు.