👉 గ్రామంలోని నిరుపయోగ కరమైన ఉపాధి హామీ పనులు
👉ఉపాధి హామీ పనులను పర్యవేక్షించని ఉన్నతాధికారులు
అందోల్ నియోజకవర్గం ప్రతినిధి మార్చి 12. ( ప్రజాబలం ) ఆందోల్ నియోజకవర్గం పుల్కల్ మండల పరిధిలో గల ఎస్. ఇటిక్యాల. గ్రామంలో ఉపాధి హామీ పనులు సాగుతున్నాయి, ప్రతి సంవత్సరం ఏప్రిల్,మే, లో ఎండలు తీవ్రంగా ఉంటాయి కానీ ఈ సంవత్సరం మాత్రం ఫిబ్రవరి మార్చి నుండే భానుడి భగభగలు మండుతున్నాయి 40 డిగ్రీల ఉష్ణోగ్రతకు చేరువలో ఉన్న సూర్యుడిఎండ తీవ్రతకు, ప్రజలు అల్లాడుతున్నారు ఇలాంటి సమయంలోపని ప్రదేశాలలో కూలీలకు కనీస అవసరాలు అయినా త్రాగునీరు ఎండ నుండి రక్షణకు టెంట్లు మెడికల్ కిట్లు, ఇవన్నీ ఏమీ లేకుండానే ఉపాధి పనులు నడిపిస్తున్నారు దీనివల్ల ఉపాధి కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు, ఇదిఇలాఉంటే, ఊరికి ఒక వైపున ఉన్నటువంటి సాకలోని వాగు అనిపిలువబడే దళితులకు సంబంధించిన భూములు,150, ఎకరాలపై చిలుకు భూముల్లోకి వెళ్లాలంటే దారి లేక ఒకరి చేనులో నుండి మరొక చేనులోకి ఇలా దారి చేసుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి, అయితే గత సంవత్సరం దళితులందరూ కలిసి, సాకలోనివాగు మా దళితుల భూముల వరకు ఉపాధహామీ పనులతో మెయిన్ రోడ్డు నుండి సాకలోని వాగు దళితుల భూముల వరకు రోడ్డువేయించాలని( ఎంపిడివో) కు,దరఖాస్తు చేసుకోగా,అప్పుడు ఉన్నటువంటి ఎంపీడీవో ఈజీఎస్ కింద 11.లక్షల 45. వేల, రూపాయలను,సాకలోని వాగురోడ్డు గురించి విధులను కేటాయించారు, అయితే గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్, సూర్రెడ్డి సాకలోని వాగు నుండి అందోల్ చెరువు వరకు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు చెందిన వరద కాలువ ( వాగు) ఉండడంతో మెయిన్ రోడ్ నుంచి ఆ కాలువ గట్టు పైనుండి సాకలోని వాగువరకు రోడ్డు పనులు చేయిస్తానని అనడంతో మెయిన్ రోడ్డు దగ్గర ఆ వాగు పక్కనే పొలం ఉన్నటువంటి, సురేందర్ గౌడ్ అనే కళ్ళు వ్యాపారి,భూస్వామి,వద్దు నా చేను పక్కనుండి పనులు చేయించవద్దు అని చెప్పడంతో ఆ రోడ్డు పనులు ఆగిపోయాయి, దీంతో దళితులు చేసేదేమీ లేక తీవ్ర ఇబ్బందులకు గురై బాధపడుతూ, ఈ సంవత్సరమైనా, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కు, చెందిన అధికారులు ఈ వరద కాలువ ఎంత వెడల్పు ఉంటుందో, సంబంధిత అధికారులు మెజర్మెంట్ చేసి మా దళితుల భూముల్లోకి రోడ్డు వేయించుకునేలా సహాయ పడగలరని కోరుతున్నారు