రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 12 మార్చి 2025
ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు, హాల్ మార్క్ విసినియా గౌతమ్, మైహోం అవతార్ సుబ్బారెడ్డిలు గౌరవ హై కోర్టులో వేసిన పిటిషన్ నంబర్ 5702/ 2025 ద్వారా వాసవి అట్లాంటిస్ వారి ఆర్.ఎం.సి ప్లాంట్ ను వెంటనే మూసి వేయ వలసినదిగా ఆర్డర్ ఇవ్వడం జరిగినదని ది సిటిజన్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు అందె లక్ష్మణ్ రావు తెలుపుతూ గత 3 సంవత్సరాలుగా ఇక్కడి ప్రజలు దుమ్ము దూళి, వాయువు, శబ్ద కాలుష్యంతో నానా తిప్పలు పడుతున్నను, స్థానిక నివాసుల సహకారంతో పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టినను, తలపెట్టిన కృషి గుర్తించనప్పటికి, సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు స్తబ్దుగా ఉండి తమాషా చూడడం జరిగినను, గౌరవ హై కోర్టులో గత వారం మరియు ఈ వారంలో 2 రోజులు వాదోప వాదాలు విని ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని పదివేల మంది జనాభా ఉన్నటు వంటి రెండు కమ్యూనిటీలలోని ప్రజల అనారోగ్య సమస్యలకు వారు హాస్పిటల్లో పడుతున్న ఇబ్బందులను విని, పసి పిల్లలు వారి తల్లిదండ్రుల ఆవేదనను విని, వయోజన వృద్దుల క్షేమం కోరి ప్రజల గొంతుకు మద్దతు తెలుపుతూ తీర్పు ఇట్చినారని అందుకు గాను వారికి మా యొక్క హృదయ పూర్వక ధన్యవాదములు తెలియ జేస్తూ ది సిటిజన్స్ కౌన్సిల్ సభ్యులు సంతోషం వ్యక్త పరుస్తు ఇది ఒకరకంగా ప్రజల విజయంగా పేర్కొంటూ మున్ముందు ప్రజల సమస్యలను తీర్చడానికి ది సిటిజన్స్ కౌన్సిల్ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని తెలియ చేసారు.
Next Post