రాజేంద్రనగర్ నియోజకవర్గ ప్రజాబలం ప్రతినిధి 9 మార్చి 2025
తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతిపిత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పుట్టిన రోజు 17 ఫిబ్రవరి పురస్కరించుకొని భారత రాష్ట్ర సమితి మణికొండ సీనియర్ నాయకుడు బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి ఆద్వర్యంలో రాజేంద్రనగర్ శాసనసభ నియోజకవర్గ పరిధిలోని పెద్ద మంగళారంలో గల హాట్ స్పాట్ క్రికెట్ గ్రౌండ్ లో కే.సి.ఆర్ ట్రోఫీ మొదలు పెట్టడం జరిగిన దరిమిలా బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ట్ర యువ నాయకుడు పట్లొల్ల కార్తీక్ రెడ్డి పుట్టిన రోజు 1 మార్చి రోజున ఫైనల్ ఆట ఆడడం జరిగినదని, మున్ముందు యువతకు, మహిళలకు అన్నిరకాల క్రీడారంగాలలో ప్రాధాన్యత ఇస్తూ ఇటువంటి ట్రోఫీలను జరుపడానికి యోచన చేస్తున్నట్లు ఉపేంద్రనాథ్ రెడ్డి తెలిపినారు.
కే.సీ.ఆర్ క్రికెట్ ట్రోఫీలో మొదటి స్థానం కైవసం చేసుకున్న ఆల్ఫా 11 టీం శ్రీకాంత్ కు 75,000, రెండవ స్థానం 50,000 లు ఆరోలియా అవేంజర్స్ టీం అజయ్ కి మరియు జై హనుమాన్ 11 టీంకి మూడవ స్థానం 25,000 రమేష్ తో పాటు సిరీస్ ప్రథమ ఆటగానిగా దీపక్ సింగ్, బ్యాట్స్ మ్యాన్ గా రమేష్ సింగ్ సాధించారని అట్లాగే ఆల్ఫా 11 టీం వారిలో బెస్ట్ బౌలర్ మనోజ్ కాగా, బెస్ట్ ఫీల్డర్ రఘులకు, బీ.ఆర్.ఎస్ పార్టీ రాష్ర్ట యువ నాయకుడు కార్తీక్ రెడ్డి కర కమలములచే ఆదివారం రోజున విజేతలకు ట్రోఫీలు అందజేయడం జరిగినదని, ఇట్టి కార్యక్రమంలో సీతారాం ధూళిపాళ, కుంబగళ్ళ ధనరాజ్, గుట్టమీది నరేందర్, రూపా రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి, ముత్తంగి లక్ష్మయ్య, అందె లక్ష్మణ్ రావు, ఏర్పుల శ్రీకాంత్, సంగం శ్రీకాంత్, సుమన్, రామసుబ్బ రెడ్డి, మాల్యాద్రి నాయుడు, యాలాల కిరణ్, శ్రీనాత్, భానుచందర్, సుమనళిని, కందాడ ప్రవీణ్, కృపాకర్, మహేందర్, రమణ మూర్తి, హూసేన్, తిరుపతి, సాగర్, మోనిష్, బిందు, అనుషా, అన్షు, సంధ్య తది తరులు పాల్గొన్నారు.
