పది రోజుల వేసవి శిభిరం ముగింపు.

మాధవ సేవా సమితి, కరీంనగర్ వారి ఆద్వర్యంలో గత పది రోజులు గా పట్టణంలోని బాల బాలికలకు దేశభక్తి, సాంస్కృతిక విలువలు,వేద గణితం, కోలాటం ,దేశభక్తుల చరిత్రలు మొదలగు అంశాలపై వేసవి శిక్షణ శిబిరం స్థానిక కేశవ నిలయంలో నిర్వహించగా శనివారం ముగింపు సమావేశం జరిగింది. కార్యక్రమంలో ముఖ్య వక్తగా ఆర్.ఎస్.ఎస్.విభాగ్ ప్రచారక్ శ్రీ. భానుచందర్ మాట్లాడుతూ విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరుచుకోవాలని,మన జీవితంలో ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ లక్ష్యం చేరేవరకు విశ్రమించకుండా లక్ష్యాన్ని సాధించాలని చెప్పారు. అదే విధంగా మన సంస్కృతి సాంప్రదాయాలు ఉన్నతమైనవని వాటిని సదా పాటించాలని మన జీవితంలో అనునిత్యం ఆచరణలో ఉంచాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో మాధవ సేవా సమితి అధ్యక్షులు హన్మoతరావు, కార్యదర్శి గుర్రాల మహేశ్వర్ రెడ్డి , సమితి బాధ్యులు కామారపు ప్రసాద్ , నగునూరు చంద్రశేఖర్ , బాల సంస్కార సాధన వర్గ నిర్వాహకులు, విద్యార్థుల తల్లిదండ్రులు ముగింపు సమావేశంలో పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking