మెదక్ జిల్లాలో ప్రశాంత పోలింగ్

75.5 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు

పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు

మెదక్ జిల్లా మే, 13 ప్రజాబలం న్యూస్ న్యూస్ :-

మెదక్ జిల్లాలో సోమవారం జరిగిన పార్లమెంట్ అభ్యర్థుల ఎన్నికలు ప్రశాంత వాతావరణం లో పోలింగ్ బ్యాలెట్ పద్ధతిన జరిగాయి. ఉదయం 6 గంటలనుంచి సాయంత్రం అరు గంటల వరకు ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మెదక్ పార్లమెంటు నియోజక వర్గంలో దాదాపు 75.5 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు పోలింగ్ కేంద్రాలను ఎన్నికల జిల్లా అధికారి మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్,
మెదక్ పార్లమెంట్ ఎన్నికల అధికారి తూప్రాన్ ఆర్డిఓ జయచంద్ర రెడ్డి,
రాష్ట్ర, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజా ప్రతినిధులు సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. ఇందులో భాగంగా మల్టీ జోన్ -1 ఐజి శ్రీ రంగనాథ్ ఐపీఎస్ మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణం లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పోలింగ్ సరళిని పరిశీలించారు. మెదక్ జిల్లాలో ఎస్పీ డాక్టర్ బాలస్వామి తన సిబ్బందితో కలిసి జిల్లాలో పోలింగ్ బూతులను పరిశీలన చేశారు. తూప్రాన్ మండల పోలింగ్ కేంద్రాలను పరిశీలించి తమ సిబ్బందికి పలు సూచనలు సలహాలు సూచించారు.
తూప్రాన్ పోలింగ్ కేంద్రాల వద్ద వైద్య సిమ్ వైద్య సిబ్బంది మందులను, మున్సిపల్ మున్సిపల్ అధికారులు సిబ్బంది ఓటర్లకు మజ్జిగ, త్రాగునీరు అందించారు.
ఘనపూర్ లో సెల్ ఫోన్ లు తీసుకొని పోలింగ్ కేంద్రాల కు ఓటర్లు రావడాన్ని గమనించి తగు సూచనలు సలహాలు ఇచ్చారు. ఎవరిని కూడా సెల్ ఫోన్ తీసుకొని వస్తె పోలింగ్ విధులు నిర్వహిస్తున్న సిబ్బందికి పటిష్టమైన బందోబస్తు గురించి తగు సూచనలు సలహాలు చేశారు.
పార్లమెంట్ నియోజక వర్గ పరిధిలో పోలింగ్ ప్రశాంతమైన వాతావరణ జరుగుతుందని, క్షేత్రస్థాయిలో పోలింగ్ కేంద్రాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పగడ్బందీగా పోలీస్ భద్రత చేపట్టామని తెలిపారు. అలాగే ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో భాగస్వాములు కావాలని సూచించారు. ఎస్పీ బాలస్వామి వెంట జిల్లా అదనపు ఎస్.పి. మహేందర్, తూప్రాన్ డిఎస్పి వెంకట్రాంరెడ్డి, సీఐ కృష్ణ, ఎస్సై శివానందం, నర్సాపూర్ సీఐ జాన్ రెడ్డి, పోలీస్ సిబ్బంది, ఎన్నికల అధికారులు, ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking