– ఎస్ ఓ టు జిఎం డి ,శ్యాంసుందర్ .
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి,నవంబర్ 18 (ప్రజాబలం):–
సోమవారం సాయంత్రం మణుగూరు మండలం తిర్లాపురం బతుకమ్మ సెంటర్ లో ఏరియా జిఎం దుర్గం రామచందర్ ఆదేశానుసారం సింగరేణి పర్యావరణ విభాగం ఆధ్వర్యంలో గ్రామస్తులకు కొబ్బరి, మామిడి, జామ, పనస,నిమ్మ, బత్తాయి, సపోటా, 250 ఉచిత పండ్ల మొక్కల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్యావరణ పరిరక్షణకు సింగరేణి ఆధ్వర్యంలో మణుగూరు ప్రాంతంలో అనేక పండ్ల పూల మొక్కలు ఉచితంగా పంపిణీ చేయడం జరిగిందని ఎంతటి ఖర్చుకైనా వెనకాడకుండా ప్రతి సంవత్సరం నిరంతరాయంగా ఈ కార్యక్రమం కొనసాగు తోందని ఆయన తెలిపారు. మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని ఆయన కోరారు. గ్రామ గిరిజన యువతి ఏనిక స్వరూప ఆధ్వర్యంలో మణుగూరు ఓసి ప్రభావిత గ్రామమైన తిర్లా పురం గ్రామస్తులకు ఉచిత మెడికల్ విటిసి శిక్షణ ఇప్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఉపాధి కూడా కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి (ఎండిఓ)శ్రీనివాస్ మణుగూరు ఓసి ప్రాజెక్ట్ అధికారి బి శ్రీనివాసచారి, మేనేజర్ బి రాజేశ్వరరావు, ఏరియా అధికార ప్రతినిధి ఎస్ రమేష్, ఏరియా పర్యావరణ అధికారి జె శ్రీనివాస్, సేఫ్టీ ఆఫీసర్ భాస్కర్, సతీష్, సింగరేణి సేవా సమితి సభ్యులు యస్ డి నా సర్ పాషా, గ్రామ పెద్దలు పాయం కామరాజు, జడ్పిటిసి లక్ష్మయ్య, పిసా కమిటీ అధ్యక్షులు మడి నరసింహారావు, స్వరూప, పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు.