నిరుపేదలకు ప్రతిరోజు వైద్యసేవ చేయడంతోనే నిజమైన తృప్తి

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.‌.నిరుపేదలకు ప్రతిరోజు వైద్య సేవలు అందించడం ద్వారా వ్యక్తిగతంగా తృప్తి లభిస్తుందని నిర్మల్ జిల్లా భైంసా ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ వైద్యులు కాశీనాథ్ పేర్కొన్నారు.కుబీర్ మండలంలోని గోడసర ప్రాథమికోన్నత పాఠశాల అధికమంది విద్యార్థులకు చర్మవ్యాధులు,గవద బిల్లల వ్యాధి సోకి తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. పాఠశాల విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించాలని ప్రధానోపాధ్యాయులు శంకర్ అభ్యర్థన మేరకు శనివారం నాడు పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు.వైద్య శిబిరంలో భైంసాకు చెందిన వైద్య బృందం పాల్గొని విద్యార్థులకు, తల్లిదండ్రులకు,గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు టానిక్లను అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, పౌష్టికాహారాన్ని తీసుకోవడం ద్వారా అంటువ్యాధులను అరికట్టవచ్చని సూచించారు.గజ్జి, తామర వ్యాధులు ఒకరి నుంచి మరొకరికి సంక్రమిస్తాయని ,మందులు వాడడం,లేపనాలు చర్మానికి పూసుకోవడం,వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, వాడిన దుస్తులను ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవడం ద్వారా వ్యాధిని అరికట్టవచ్చన్నారు .ఈ చర్యల ద్వారా అంటూ వ్యాధుల చక్రాన్ని తెంపడం,వ్యాధినీ అరికట్టడం సాధ్యమవుతుందన్నారు. పాఠశాల పిల్లలను చూస్తుంటే తన బాల్యం గుర్తోస్తుందని గుర్తు చేసుకున్నారు. నిరుపేదలకు వైద్య సేవలు అందించడం ద్వారా ఆనందం కలుగుతుందని ఆరోగ్యంగా ఉండడం జరుగుతుందని తెలియజేశారు. చిన్నపిల్లల వైద్య నిపుణులు విజయ్ ఆనంద్ మాట్లాడుతూ పౌష్టికాహార లోపం,జంక్ సంబంధిత ఆహారాన్ని తీసుకోవడం,పలు సమస్యలకు కారణం అన్నారు .ప్రస్తుతం ప్రబలిన గవద బిల్లల వ్యాధి నోటి శుభ్రత ద్వారా అరికట్టవచ్చన్నారు. రోజుకు రెండుసార్లు పండ్లను శుభ్రపరచుకోవడం ,వేడి నీళ్లను పుక్కిలించడం, అవసరమైన పక్షంలోనే మందులు వాడాలని సూచించారు. అపరిశుభ్రత చర్మవ్యాధులకు తల్లి లాంటిది అన్నారు. కుటుంబంలోని ప్రతి వ్యక్తి పరిశుభ్రత పాటించాలన్నారు. ప్రధానోపాధ్యాయులు శంకర్ మాట్లాడుతూ షీలలను శిల్పులు శిల్పాలుగా మలుస్తారని,సమాజానికి అవసరమయ్యే పౌరులుగా విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయులు ముందు ఉంటారని గుర్తు చేశారు.లక్ష్యాన్ని నిర్దేశించుకుని లక్ష్యానికి అనుగుణంగా చదవడం ద్వారా సామాన్యమైన విద్యార్థులు సైతం భవిష్యత్తులో సమాజానికి అవసరమైన వ్యక్తులను తీర్చిదిద్దడం కేవలం విద్య తోనే సాధ్యమన్నారు అన్ని రంగాల్లో రాణించడం జరుగుతుందన్నారు .తన విద్యార్థి విజయానంద్ పిల్లల వైద్యుడిగా ప్రత్యేక గుర్తింపు పొందడం ఆనందకరమన్నారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వైద్యులను పాఠశాల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.ఈ శిబిరంలో హైదరాబాదు నుండి వచ్చిన ప్రత్యేక వైద్యులు కృష్ణ తేజ, జస్వంత్,భైంసా కు చెందిన వైద్యులు ముత్యం రెడ్డి, నగేష్,చంద్రశేఖర్,కుమార్ యాదవ్, పాఠశాల చైర్మన్ భోజరామ్,ఉపాధ్యాయులు,పిల్లల తల్లిదండ్రులుగ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking