బైక్ పై తిరుగుతూ..యోగక్షేమాలు తెలుసుకుంటూ జనం పార్టీ శ్రేణులతో మమేకమవుతూ సాగిన పొంగులేటి ప్రసాద్ రెడ్డి పర్యటన
ఖమ్మం ప్రతినిధి మార్చి 03 (ప్రజాబలం) ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కాంగ్రెస్ జిల్లా నాయకులు పొoగులేటి ప్రసాద్ రెడ్డి నేరుగా తమ పార్టీ నాయకులు, కార్యకర్తల ఇళ్ల వద్దకే వెళ్లి వారి బాగోగులు తెలుసుకుంటూ శనివారం తన పర్యటన కొనసాగించారు భైరవుని పల్లిలో ద్విచక్ర వాహనంపై తిరిగుతూ అందరినీ పలకరిస్తూ ముందుకు సాగారు నూక పెద్ద నరసయ్య, రేపాల మురళీ కృష్ణ పెడ్డపాక వెంకటేశ్వర్లు సీపీఐ నాయకులు కనకబండి సీతారాములు వోర్సు పమీలను పరామర్శించారు పాలెబోయిన రామారావు కనకపాటి గోవిందరావు నివాసాలకు వెళ్లి నూతన జంటలను ఆశీర్వదించారు
గువ్వల గూడెం లో ఆత్మీయ సమావేశం
కాంగ్రెస్ నాయకులు శాఖమూరి రమేష్ పార్టీ శ్రేణులతో ఆత్మీయ సమావేశం నిర్వహించగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. పొంగులేటి శీనన్న నేతృత్వంలో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక నిధులు కేటాయించారని హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ.. ఏ సమస్య వచ్చినా నేరుగా వచ్చి కల్వొచ్చనీ అభయం ఇచ్చారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు