విక్రమ్ వంజరి గారి తండ్రి నిజామబాద్ జిల్లా అదనపు మాజి జాయింట్ కలెక్టర్ రాజారాం వంజరి గారు.రాజారాం వంజరి గారు 12-07-1958లో జ్ఞానమ్మ-నారాయణ దంపతులకు వరంగల్ జిల్లా కెసముద్రం మండలంలోని తాళ్ళపూసపల్లి గ్రామంలో జన్మించారు. అక్క 4గురు తమ్ముళ్లు. డిగ్రీ ద్వితీయ సం॥ చేస్తున్న క్రమంలోనే 1979లో కళావతితో వివాహం జరిగింది. ఇద్దరు కుమారులు పి. విక్రమ్ , చిన్న కుమారుడు సూర్యం .ఆయన బెంగుళూర్ పట్టణంలోని కేంద్రీయ విద్యాలయంలో పోస్ట్ గ్రాడ్యూయేట్ టీచర్ గా 1988-90సం॥ వరకు సేవలందించారు. ఇదే క్రమంలో ఎంఇడి అన్నమలై యూనివర్సిటిలో పూర్తి చేశారు. వీటిని చేస్తునే ఎపిపిఎస్సికి ప్రిపేరయ్యారు. పాలిటెక్నిక్ లెక్చరర్గా కడప జిల్లాలో ఉద్యోగం వచ్చినా దానికి మొగ్గు చూపకుండా 1990సం॥లో ఎపిపిఎస్సి ద్వార వరంగల్ జిల్లాలో డిప్యూటి తహసిల్దార్ గ ఉద్యోగం రావడంతో దీనికే ప్రాధాన్యమిచ్చారు. వరంగల్ జిల్లాలో 12 సం॥లు పదోన్నతిపై తహసిల్దార్ గ 14 మండలాలలో విధులు నిర్వహించారు. వరంగల్లులో విదులు నిర్వహిస్తూనే ఎల్ఎల్బీ పూర్తి చేశారు. అనంతరం ఖమ్మం జిల్లా డిప్యూటి కలెక్టర్ గ దాదాపు ఒక సం॥ సేవలందించాక బదిలీపై ఆదిలాబాద్ జిల్లాలో ఎస్సి కార్పోరేషన్ ఇడిగా వెళ్లి 3సం॥లు సేవలందించారు. అనంతరం ఆర్డివోగా ఆదిలాబాద్ లో విధులు నిర్వహించి కొత్తగూడెం ఆర్డిఓగా బదిలీపై వెళ్ళి 2సం||లు సేవలందించారు. కరీంనగర్ ఆర్డిఓగా బదిలీపై వెళ్ళి సేవలందించారు. అనంతరం మంథనికి ఆర్డిఓగా సేవలందించారు. అక్కడ విధులు నిర్వహించిన సమయంలో జిల్లాలోనే సివిల్సప్లై డి.ఎంగా సేవలందించారు. అనంతరం ఎస్ఎసి ల్యాండ్ అక్వైజేషన్ గ సేవలందించిన అనంతరం పదోన్నతిపై హైదరాబాద్ లోని భూభారతిలో ఎస్ఎసిగా విధులు నిర్వహించారు. అనంతరం పోల్యూషన్ కంట్రోల్ బోర్డు (పి.సి.బి) అడ్మినిస్టేషన్ మేనేజర్ గా విధులు నిర్వహించిన ఆయన జడ్పి సిఇఓగా జనవరి 2012లో నిజామబాద్ జిల్లాకు పదోన్నతితోపాటు బదిలీపై వచ్చి 2014సం॥ వరకు విధులు నిర్వహించిన అనంతరం ఏజెసిగా పదోన్నతి లభించడంతో జిల్లాలోనే సేవలందిచారు. ఈ క్రమంలోనే ఇంచార్జి డ్వామా పిడిగా, జెసిగా, కలెక్టర్గా, డిఆర్గాను సేవలందించి పరిపాలనలో తనవంతు సహకారం అందించారు. విధినిర్వహణలో ఎన్నో ఆటుపోటులను ఎదుర్కొన్న ఆయన చట్టపరంగా విధులు నిర్వహించడానికే ప్రాధాన్యమిచ్చారు. ఎటువంటి ప్రలోభాలకు, ఒత్తిడులకు లొంగకుండా చట్టపరంగా ప్రజలకు సేవలందించారు. 2007-09సం॥ కొత్తగూడెంలో ఆర్డిఓగా విధులు నిర్వహస్తున్న క్రమంలో 850 గిరిజన కుటుంబాలకు 75వేల ఎకరాల భూమిని ఆర్ఎస్ఆర్ చట్టము క్రింద పట్టాలు పంపిణి చేశారు. బహుశా రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఇంత మొత్తంలో ఏ అధికారి పంపిణి చేసి ఉండరు.అపారమైన మేదాసంపత్తితోపాటు విధి నిర్వహణలో అనుభవము ఉంది. పురస్కారాలకు కొదువలేదు. సకల జనుల సమ్మెలో కృషి పురస్కార్ ని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రశంసా పత్రాలను, 2014లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో రిటర్నింగ్ అధికారిగా విధులు నిర్వహించి రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా పురస్కారాలు అందుకున్నారు. నిజామబాద్ జిల్లా అదనపు జాయింట్ కలెక్టర్ గ రాజారాం గారు పదవి విరమణ పొందారు. ఈ కోవలోనే తన పెద్ద కుమారుడు తండ్రి కి తగ్గ తనయుడిగ పటేరి విక్రమ్ వంజరి ICBM – ప్రీమియర్ బిజినెస్ స్కూల్ నుండి మానవ వనరుల నిర్వహణలో ఎంబిఎ పూర్తి చేసి పర్సనాలిటీ స్కిల్ డెవలప్మెంట్ ఏజెన్సీలో డైరెక్టర్ గ విధులు నిర్వహించారు.HR గామట్ మరియు HR ఆపరేషన్స్, & లెర్నింగ్ లో 18 సంవత్సరాల పైన అనుభవాన్ని కలిగి ఉన్నారు .ఐఎన్‌జి గ్రూప్, హిందుజా గ్రూప్ (గల్ఫ్ ఆయిల్) వంటి టాప్ కార్పొరేట్‌లో పనిచేశాను.హెటెరో గ్రూప్, క్లారియంట్ & యంగ్‌గోన్ కార్పొరేషన్ (కొరియా బేస్డ్ టెక్స్‌టైల్ కంపెనీ)లో పనిచేశాను. ప్రస్తుతం ఒక కార్పొరేట్ HR కంపెనీ లో హెడ్ HR గా సేవలందిస్తున్నారు… సామాజిక సేవ చేయాలనే తపనతో ఎన్నో సేవ కార్యక్రమం లు నిర్వహిస్తూ వస్తున్నాడు. కుటుంబ ప్రాముఖ్యత గురించి ఎన్నో టీ.వి.షోల ద్వార విధ్యార్ధులకి , తల్లి దండ్రులకు అవగాహన కలిపిస్తు ఎందరో మన్ననలు పొందుతు మరెందరికో ఆదర్శంగ నిలుస్తు న్నాడు పటేరి విక్రమ్ వంజరి గారు.