గృహ జ్యోతి పథకాన్ని ప్రభుత్వ పాఠశాలలకు వర్తింప చేయాలి :తపస్

 

చేగుంట 2/03/24 ప్రాజబలం న్యూస్ –

మెదక్ జిల్లా చేగుంట మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఇబ్రహీంపూర్ లో తపస్ జిల్లా ప్రధాన కార్యదర్శి చల్లా లక్ష్మణ్ మాట్లాడుతూ 2019 నుంచి ఉద్యోగ ఉపాధ్యాయులకు మొదటి తారీకు జీతాలు రాక అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు అని, ఈ ప్రభుత్వం మొదటి తారీకు జీతాలు ఇవ్వడం హర్షనీయమని, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకాన్ని అన్ని ప్రభుత్వ పాఠశాలకు వర్తింపచేసి, ఉచిత విద్యుత్ అందించాలని, ప్రభుత్వ పాఠశాలల విద్యుత్ పాత బకాయిలను రద్దు చేయాలని,గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా విద్యావ్యవస్థ పది సంవత్సరాల వెనుకకు వెళ్లిందని, ప్రభుత్వ పాఠశాలలకు సొంత భవనాలు నిర్మాణం చేపట్టకుండా వదిలి వేసిందని, నూతన ప్రభుత్వం అయిన మన ఊరు మన బడిలో మంజూరైన అన్ని పనులు త్వరగా పూర్తి చేసి, పాఠశాలలను నవీకరించి, మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమం లో తపస్ మండల ప్రధాన కార్యదర్శి రేఖ, తపస్ జిల్లా ఉపాధ్యక్షులు చక్రవర్తి, తపస్ నాయకులు అల్లం ఆంజనేయులు,మురళీ కృష్ణ, శంకర్, రజిత, ఎల్లం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking