జిల్లా డిసిసిబి డైరెక్టర్లు మేకల మల్లి బాబు యాదవ్ జనగం కోటేశ్వరరావు జిల్లా కాంగ్రెస్ నాయకులు పులిగండ్ల మాధవరావు
ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 04 (ప్రజాబలం) ఖమ్మం పొంగులేటి శ్రీనివాసరెడ్డి రెవెన్యూ గృహ నిర్మాణ మరియు సమాచార శాఖ మాత్యులు గారిని తమ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు శ్రీ పులిగల మాధవరావు గారు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ జిల్లా డైరెక్టర్లు శ్రీ మేకల మల్లిబాబు యాదవ్ శ్రీ జనగం కోటేశ్వరరావు గారు మరియు కాంగ్రెస్ నాయకులు శేఖర్ తదితరులు కలిసి పంట రుణాలు తీసుకున్న ప్రతి ఒక్క రైతుకు రుణమాఫీ జరగాలని వినతి పత్రం ఇచ్చినారు ఏజెన్సీ ప్రాంతాలలో ధరణి పోర్టల్ రాకమునుపు అడంగల్ పహాని మాన్యువల్ పాహాని ల ఆధారంగా వివిధ బ్యాంకులు పంట రుణాలు ఇచ్చారు ఆ రుణాలను రైతులు రెన్యువల్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు ఈరోజు ఎన్నికల వాగ్దానాలలో రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ ప్రకటించినది గెలిచిన మూన్నాళ్ళకే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగు లేకున్నా ఇచ్చిన మాట ప్రకారం రైతుశ్రేయస్సేపరమావధిగా భావించి ప్రభుత్వం రెండు లక్షల రుణమాఫీకి పూనుకున్నది మొదటి విడత రెండో విడత లక్ష 50 వేల వరకు రుణాలు మాఫిచేసినది. ప్రభుత్వం పట్టాదారు పాసుబుక్ ఉన్నటువంటి వారికే వర్తించేటటువంటి విధంగా సర్కులర్ జారీ చేసినది దీనివలన ఏజెన్సీ మండలాలు జిల్లాల లోని రైతులకు కొంత అన్యాయం జరుగుతుంది. కీర్తిశేషులు మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి గారి కాలంలో ఒకే సారి రెండు లక్షల రుణమాఫీ రుణము తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి వర్తించే విధంగా మాఫీ చేసి ఉన్నారు. గత ప్రభుత్వము కూడా ఎలాంటి కండిషన్ లేకుండానే రుణమాఫీ చేయడం వలన రైతులందరికీ మాపీ వర్తించినది రైతు పక్షపాతి అయిన మన ప్రభుత్వం పాసుబుక్ ఆధారంగా కాకుండా బ్యాంకులో పంట రుణాలు తీసుకున్నటువంటి అందరికీ రుణమాఫీ వర్తించే విధంగా ప్రయత్నం చేయాలని కోరినాము మంత్రివర్యులు స్పందిస్తూ ఇది జన్యున్ విషయం ఇది స్టేట్ లెవల్లో ఉంది ఈ విషయాన్ని ప్రభుత్వం చర్చించి మంచి నిర్ణయం తీసుకుం టుందని హామీ ఇచ్చినారు వెంటనే స్పందించి హామీ ఇచ్చినటువంటి మంత్రి గారికి ఏజెన్సీలోని రైతులందరి తరఫున కృతజ్ఞతలు అభినందనలు తెలియజేశామని తెలిపారు