– స్వయంగా ఇంటికి వెళ్లి అభినందించిన ప్రణవ్
– అధైర్యపడవద్దు అండగా ఉంటాం.విద్యార్థినికి ప్రణవ్ భరోసా.
– ప్రతిభ ఉన్న విద్యార్థులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుంది.
– రాష్ట్రంలో నలుగురు ఎంపిక కాగా హుజురాబాద్ వాసి ఉండడం గర్వకారణం.
– అమెరికాలో ఉన్నత విద్య పూర్తి చేసి తెలంగాణ రైతులకు సేవ చేయాలని పావనిని కోరిన ప్రణవ్.
వీణవంక ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 4
పట్టుదల ఉంటే మనిషి ఏదైనా సాధిస్తాడని దానికి నిదర్శనం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మూల పావణి అని కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు.ప్రతిభ ఉన్న విద్యార్థులను
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని,అమెరికాలో ఉన్నత చదువు చదవడానికి విద్యార్థినికి 55 లక్షల ఆర్థిక సాయం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని పేద విద్యార్థుల పట్ల ఇది కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి అని వారు అన్నారు.ఈ సందర్భంగా మోడల్ స్కూల్ లో చదివి అమెరికాలో సీటు పొందిన విద్యార్థినికి మామిడాలపల్లిలోని నివాసానికి వెళ్లి అభినందించారు.అమెరికాలో ఉంటున్నానని అధర్యపడవద్దని ఏదైనా సమస్య వస్తే నన్ను సంప్రదించాలని విద్యార్థినికి ఆ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.సాధారణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి చిన్ననాటి నుంచే చదువులో ప్రతిభ కనబరుస్తున్న సరస్వతీ పుత్రికకు అమెరికాలో ఉచితంగా మాస్టర్స్ చేసే అవకాశం వచ్చింది. ప్రతిభావంతులను ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ నుంచి అమెరికాలో ఉన్నత విద్య (మాస్టర్స్) అభ్యసించడానికి నలుగురు విద్యార్థులను ఫెలోషిప్తో ఎంపిక చేయగా,అందులో కొండా లక్ష్మణ్ బాపూజీ హార్టికల్చర్ యూనివర్సిటీలో బీఎస్సీ పూర్తిచేసిన వీణవంక మండలం మామిడాలపల్లి గ్రామానికి చెందిన మూల పావని కూడా ఉన్నది.అమెరికాలోని అబరాన్ యూనివర్సిటీలో మాస్టర్స్ పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయశాఖ ద్వారా రెండేళ్లకు ప్రభుత్వం 55.50 లక్షలు ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు ప్రకటించిన విషయం విధితమే కాగా అమెరికాలో ఉన్నద విద్య పూర్తి చేసి తెలంగాణ రైతులకు తాను నేర్చుకున్న విద్యను ఇక్కడ రైతులకు ఉపయోగపడేలా కృషి చేయాలని కోరారు రాష్ట్రంలో నలుగురు విద్యార్థులు ఎంపికగా అందులో హుజురాబాద్ వాసి ఉండడం గర్వకారణమని వారు అన్నారు. పేద కుటుంబంలో పుట్టిన నాకు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయడం పట్ల విద్యార్థిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి సీఎం రేవంత్ రెడ్డికి,మంత్రి తుమ్మల నాగేశ్వరరావు,స్థానిక నియోజకవర్గ ఇన్చార్జి ప్రణవ్ కు కృతజ్ఞతలు తెలియజేశారు.