ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలి చేగుంట ఎమ్మార్వో

 

చేగుంట 15/04/24 ప్రజాబలం న్యూస్ :-

మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని బస్ స్టాండ్, గాంధీ చౌరస్తాలో ఓటు హక్కు వినియోగం పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేగుంట ఎమ్మార్వో గీయస్ ఉన్నిసా బేగం మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారత దేశంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కు వినియోగించుకున్నప్పుడే ప్రజాస్వామ్యం విజయవంతం అవుతుందని, కులమత వర్గ లింగ బేధాలు లేకుండా 18 సంవత్సరాలు నిండిన వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని,ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చిన్న రెడ్డి,ఆర్ ఐ నర్సింగ్ యాదవ్, మండల నోడల్ ఆఫీసర్ నీరజ,రెవిన్యూ సిబ్బంది రవీందర్ రెడ్డి, రాజేష్,భూమేష్, కవిత, మొగులయ్య,ఉపాధ్యాయులు శారద, చల్లా లక్ష్మణ్, బి ఎల్ వో లు, ఐ కే పి సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking