ఖమ్మం ప్రతినిధి ఏప్రిల్ 15 (ప్రజాబలం) ఖమ్మం నెహ్రునగర్ లో గల పాత సి.పి.ఐ కాంప్లెక్స్ నాలుగవ అంతస్తులో మార్వాడి యూనివర్సిటీ- గుజరాత్ యొక్క ఖమ్మం రీజినల్ అడ్మిషన్ ఆఫీస్ ని సొమవారం ఘనంగా ప్రారంభించారు. ముఖ్య అతిధులు ప్రిన్సిపల్ ఫ్యాకల్టీ ఆఫ్ ఇంజినీర్ రాజేష్ కుమార్ పటేల్ చేతులమీదుగా ఆఫీస్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేష్ కుమార్ మాట్లాడుతూ దేషంలోనే మార్వాడి యూనివర్సిటీ 23వ స్థానంలో నిలవడంతో పాటు న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు పొందిందని అన్నారు. అదేవిదంగా సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సి పొంది 53 దేశాల విధ్యార్దులు యూనివర్సిటీలో చదువుతున్నారని వివరించారు. ఈ యూనివర్సిటీ లో ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగిన సౌకర్యాలు, ఇప్పుడున్న పరిస్థుతులను బట్టి మధ్య తరగతి విధ్యార్దులు చదువుకునే విధంగా ఫీజులు నిర్ణయించామని తెలిపారు. పదవ తరగతి, ఇంటర్మిడియట్ ఉత్తీర్నూలైన 50 శాతం మార్కులు పొందిన విద్యార్ధులు అర్హులని అన్నారు. మార్వాడి యూనివర్సిటిలో కోర్సులు డిప్లొమా, బిటెక్, ఎంబిఎ, ఫార్మసీ, బీఎస్సి అగ్రికల్చర్, ఫిజియొతెరఫి, ఎల్ ఎల్ బి తదితర కోర్సుల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఈ కర్యక్రమంలో ఆంధ్రా మరియు తెలంగాణ ఇంచార్జ్ మహేంద్ర నాయుడు గారు ,వెంకట వినయ్ భాను ఖమ్మం బ్రాంచ్ మేనేజర్ వెంకీ నాయుడు చరన్ ఆల్లష్యం తిరుమల రెడ్డి దివ్య బాలినేని తదితరులు పాల్గొన్నారు. ఇతర వివరాలకు 7799467788 / 8886661866 నెంబర్లని సంప్రదించాలని సూచించారు.