జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో పేర్లు నమోదు చేసుకోవాలి

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి & జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్

మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా ప్రజాబలం ప్రతినిధి ఆగస్టు 25:
జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త పునరీక్షణ కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేర్లను తప్పకుండా నమోదు చేసుకోవాలని ఓటు హక్కు ఎంతో విలువైనదని మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ అమోయ్కుమార్ అన్నారు.
శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మాట్లాడుతూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ సూచనల మేరకు జిల్లా వ్యాప్తంగా 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులతో పాటు 2023 అక్టోబర్ 1వ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండబోయే యువత ఓటర్లుగా నమోదు చేసుకోవడానికి అర్హులని కలెక్టర్ అమోయ్ కుమార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఓటర్లుగా తమ పేర్లను నమోదు చేసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా బూత్ లెవల్ అధికారి (బీఎల్వో)లతో ఈనెల 26, 27 తేదీలతో పాటు సెప్టెంబర్ 2, 3వ తేదీల్లో ప్రత్యేక క్యాంపెయిన్ కార్యక్రమాలు నిర్వహించి ఇంటింటికి వెళ్ళి అర్హులైన వారి పేర్లను ఓటర్లుగా నమోదు చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. అలాగే ఆయా తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవల్ అధికారులు అందుబాటులో ఉంటారని కలెక్టర్ స్పష్టం చేశారు. ఓటరు నమోదుతో పాటు ఏమైనా మార్పులు, చేర్పులు చేయాల్సి ఉంటే స్థానికంగా ఉండే బూత్ లెవల్ అధికారిని సంప్రదించాలని వారి వద్ద నూతనంగా ఓటరు నమోదుకు సంబంధించి ఫారం–6లో, సవరణలు ఉంటే ఫారం–8లో చేసుకోవచ్చని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. అలాగే voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా… voter Helpline Mobile App ద్వారా ఆన్లైన్లో వెబ్సైట్ ద్వారా కూడా నమోదు, సవరణలు చేసుకోవడానికి అవకాశం ఉందని దీనిని వినియోగించుకోవాలని తెలిపారు. ఓటరు నమోదుతో పాటు మిగిలిన వివరాలకు జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ స్థాయి అధికారి, ఏఈఆర్వో, ఈఆర్వో, జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయంలో సంప్రదించాలని కలెక్టర్ అమోయ్ కుమార్ వివరించారు. ప్రత్యేకంగా టోల్ ఫ్రీ నెంబర్ 1950 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటుందని కలెక్టర్ అమోయ్ కుమార్ తెలిపారు. ఓటు హక్కు ఎంతో విలువైనదని అందువల్ల ఇప్పటికీ ఓటర్లుగా తమ పేర్లు నమోదు చేసుకోని వారు తప్పకుండా నమోదు చేసుకోవాలని కలెక్టర్ అమోయ్ కుమార్ కోరారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking