ప్రజా పాలన గ్రామసభల నిర్వహణ తీరు పరిశీలన మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

 

ప్రజాబలం ప్రతినిధి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా: ప్రభుత్వం ప్రకటించిన అభయహస్తం 6 గ్యారంటీ పథకాల ద్వారా అమలు చేయనున్న సంక్షేమ పథకాలను పేదలు లబ్ధి పొందేందుకు చేపట్టిన ప్రజా పాలన దరఖాస్తు స్వీకరణ కార్యక్రమమును సద్వినియోగం చేసుకోవాలని అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, తెలిపారు. మంగళవారం మూడు చింతల పల్లి మండలం లోని కొల్తురు, నారాయణ పూర్ , ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ కేంద్రాలను అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా పాలన కార్యక్రమమును అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియం చేసుకోవాలని ఆయన తెలిపారు. రేషన్ కార్డు లేని వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన సూచించారు. దరఖాస్తు ఫారాలను తప్పులు లేకుండా నింపి అధికారులకు అందజేయాలన్నారు.
ఈ కార్యక్రమంలోఅధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking