నగరంలోని 24, 25 డివిజన్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్
వరంగల్ ప్రజాబలం ప్రతినిధి జనవరి 2
ప్రజా పాలన కార్యక్రమాన్ని అర్హులైన వారందరు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పి ప్రావిణ్య పేర్కొన్నారు.
మంగళవారం వరంగల్ నగరంలోని 24 వ డివిజన్ ఎల్లంబజార్ కమ్యూనిటీ హల్ లో, 25వ డివిజన్ చార్ బౌలి వాటర్ ట్యాంక్ అభయ హస్తం స్వీకరణ కేంద్రాలను కలెక్టర్ సందర్శించి దరకాస్తూ ఫారాల స్వీకరణ తీరును పరిశీలించి సమర్ధవంతంగా నిర్వహించుటకు తగు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 44 బృందాల ద్వారా అభయ హస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులను గత డిసెంబర్ 28 నుండి ఈ నెల 6వ తేదీ వరకు ఉదయం 8 నుండి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుండి 6 గంటల వరకు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఇప్పటివరకు లక్షకు పైగా దరకాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు.
జిల్లా వ్యాప్తంగా సూచించిన వివిధ ప్రాంతాల్లో కౌంటర్ లను ఏర్పాటు చేసి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతున్నదని, ఒక కుటుంబానికి సంబందించి కామన్ దరఖాస్తు అందజేయాలని, దరఖాస్తు అందజేసే క్రమం లో యజమాని ఆధార్ కార్డ్,రేషన్ కార్డ్ నకలు పత్రాలు జత చేయాలని,రేషన్ కార్డ్ లేని వారు ఆధార్ జిరాక్స్ పత్రం ద్వారా కూడా దరఖాస్తు చేసుకోవచ్చునని, ప్రభుత్వం అందజేసిన దరఖాస్తు ద్వారా కాకుండా జిరాక్స్ తీసుకున్న దరఖాస్తు తో కుడా అప్లయ్ చేసుకోవచ్చని, దరఖాస్తు స్వీకరణ కేంద్రాల్లో మహిళలు, పి డబ్ల్యు డి వృద్దులకు ప్రత్యేక కౌంటర్ లతో పాటు సాధారణ దరఖాస్తు స్వీకరణ కేంద్రాలు ఏర్పాటు చేశామని అన్నారు. సందేహాలను నివృత్తి, దరాకస్తులు పురించుటకు సహకార నిమిత్తం హెల్ప్ డెస్క్ లను కూడా ఏర్పాటు చేశామన్నారు.
సంక్షేమ పథకాల ద్వారా అర్హులైన వారందరికీ లబ్ధి చేకూర్చేందుకు వీలుగా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలలో ప్రజల అందించే అన్ని రకాల దరఖాస్తులను స్వీకరించాలని అధికారులకు సూచించారు.
ఈ కార్యక్రమాల్లో కార్పొరేటర్లు తేజస్విని రామ, బస్వరాజు శిరీష ఆర్డీఓ వాసు చంద్ర, డెప్యూటీ కమిషనర్ కృష్ణ రెడ్డి, నోడల్ అధికారులు నరసింహమూర్తి, బషీర్, సుష్మ, వార్డ్ అధికారులు హాబీబ్ సంబంధిత
అధికారులు తదితరులు పాల్గొన్నారు.