ముగ్గుల రూపంలో ప్రదర్శనలు
మెదక్ జనవరి 5 ప్రజా బలం న్యూస్ :-
మెదక్ విద్యార్థినిల్లోని సృజనాత్మక వెలికి తీసేందుకు జన్య ఫౌండేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక తెలంగాణ గిరిజన గురుకుల బాలికల విద్యార్ధినులకు నిర్వహించిన జన్య సైంటిఫిక్ రంగోలి, రంగోలి సైన్స్ ఫైర్ కార్యక్రమం ఉత్సాహంగా జరిగింది. తరగతి గదిలో కృత్యముల ద్వారా నేర్చుకున్న సైన్స్, గణిత అంశాలను విద్యార్థినులు ముగ్గుల రూపంలో ప్రదర్శనలు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ హిమబిందు మాట్లాడుతూ.. విద్యార్థినులల్లో దాగి ఉన్న సృజనాత్మక, పట చిత్రీకరణ, నైపుణ్యం, పటాల్లోని భాగాలను గుర్తించడం, ఆ అంశాలను సులభంగా అవగాహన చేసుకునేందుకు దోహద పడుతుందన్నారు. అంతేకాకుండా పఠన సామర్థ్యం పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జన్య ఫౌండేషన్ నిర్వాహకులు రామకృష్ణ, పాఠశాల ఉపాధ్యాయురాలు, విద్యార్థినులు పాల్గొన్నారు.