మెదక్ చర్చిమహాదేవాల యం అభివృద్ధికి రూ 29 కోట్ల 18 లక్షల 50 వేలు మంజూరు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేసిన
మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజొద్దిన్ మోల్ సాబ్
మెదక్ పట్టణంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మెదక్ చర్చి 25 డిసెంబర్ 2024 నాటికీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొంటుందని ఈ మహాదేవాలయoను అభివృద్ధి పరుచుటకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 29 కోట్ల 18లక్షల 50 వేల రూ.మంజూరు చేసింది,మంజూరు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి,రాష్ట్ర పర్యాటక మంత్రి వర్యులు జూపల్లి కృష్ణ రావు కు,నిధులు మంజూరికి కృషి చేసిన మన మెదక్ యువ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు కు,నిధులు రావడానికి సహకరించిన జిల్లా ఇంచార్జి మంత్రి కొండా సురేఖ కు,జిల్లా మంత్రి వర్యులు దామోదర్ రాజనర్సింహ కు మెదక్ ప్రజల తరపున ధన్యవాదములు తెలుపుతు న్నామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మెదక్ జిల్లా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హఫీజొద్దీన్ మోల్ సాబ్ అన్నారు.అలాగే మెదక్ నియోజకవర్గంలోని కోoటూర్ చెరువు,కోoటూరు గ్రామంలో గల జామ మస్జీద్ కు ఏడుపాయల దేవస్థానంకు పోచారం వన్యప్రాణుల అభయారణ్యం అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు పంపారు.త్వరలోనే వీటన్నింటినీ అభివృద్ధి పథంలో ముందంజ వేస్తున్నామని ఆయన సంతోషం వ్యక్తం చేశారు.గత పది సంవత్స రాలనుండి మెదక్ అభివృద్ధి ని తెరాస ప్రభుత్వం పట్టించు కోలేదు,కానీ రాబోయే నాలుగు సంవత్సరాలు ఎమ్మెల్యే రోహిత్ రావు ఆధ్వర్యంలో మెదక్ ను అభివృద్ధి పథంలో ముందుకు నడిపిస్తామని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు మేకల రవి,మంగ మోహన్ గౌడ్, అశోక్ రెడ్డి,కిషన్ గౌడ్,సలీం, ముజీబ్,జహంగీర్,సూఫీ, నాగిరెడ్డి,సంజీవ్ తో పాటు తదితరులు పాల్గొన్నారు.