గృహలక్ష్మి దరఖాస్తు స్వీకరణ గడువు పెంచండి

సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 8 (ప్రజాబలం) ఖమ్మం గృహలక్ష్మి పథకానికి సంబంధించి దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం ఈనెల చివరి వరకు పొడిగించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి పోటు ప్రసాద్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. సొంత స్థలం ఉండి ఇండ్లు లేని నిరుపేదలకు గృహలక్ష్మి పథకం కింద మూడు లక్షల రూపాయలకు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ విషయంలో అధికారులు 10వ తారీఖు వరకు గడువు విధించారని కానీ ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చాలా మంది ప్రజలకు తెలియదని అదేవిధంగా కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను కూడా సమర్పించాల్సి ఉన్నందున వాటిని తీసుకునేందుకు కూడా సమయం పడుతుందని దానిని దృష్టిలో ఉంచుకుని దరఖాస్తుల స్వీకరణ గడువును ఈనెలాఖరు వరకు పొడిగించాలని పోటు ప్రసాద్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking