రోడ్డు ప్రమాద బాధితులకు అండగా నిలిచిన పొంగులేటి

 

ఖమ్మం ప్రతినిధి ఆగస్టు 8 (ప్రజాబలం) ఖమ్మం ఇటీవల కోదాడలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఖమ్మం నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న ఖమ్మం నగరం 41వ డివిజన్ కు చెందిన నయీం, మన్సూర్ అలీ ను తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ కో ఛైర్మన్ పొంగులేటి శ్రీనివాస రెడ్డి మంగళవారం పరామర్శించారు. గాయలబారి నుంచి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. చికిత్స నిమిత్తం ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున మొత్తంగా లక్ష రూపాయలను అందజేశారు. భవిష్యత్తులో అండగా ఉంటానని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking