జూలై 1 వరకు అవకాశం.
రీజినల్ కో ఆర్డినేటర్ టి.సంపత్ కుమార్.
మెదక్ ప్రాజబలం న్యూస్ :-
మెదక్
జిల్లాలోని కౌడిపల్లి, మెదక్ గిరిజన సంక్షేమ మినీ గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గడువు జులై ఒకటి వరకు పెంచినట్లు ఆ సంస్థ ప్రాంతీయ సమన్వయకర్త సంపత్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఒకటవ తరగతిలో కొత్త అడ్మిషన్లు, రెండవ తరగతి నుండి 5 వ తరగతి వరకు పరిమిత సంఖ్యలో గల ఖాళీల కోసం సంబంధిత పాఠశాలల ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని సూచించారు. మెదక్, కౌడిపల్లి మండలాలకు చెందిన గిరిజన బాలికలు జనన, కుల, ఆదాయ, స్టడీ సర్టిఫికెట్లు తీసుకొని ఆయా పాఠశాలల్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సీబీఎస్ ఈ విధానంలో విద్యా బోధన ఉంటుందని, ఈ చక్కటి అవకాశాన్ని అందరూ సద్వినియోగపర్చుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.