మెదక్ జిల్లా లో దలితులకు తీవ్ర అన్యాయం.

 

దళిత జర్నలిస్ట్ మామిడి తోట అక్రమంగా తొలగింపు

ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ లో మెదక్ మున్సిపాలిటీలో ఉన్న భూమిని ఔరంగాబాద్ గ్రామంలో ఉన్నట్టు చెప్పారు. ఎందుకు?
అని అడుగుతే సమాధానం ఉండదు.

మెదక్ 23 మార్చ్ ప్రజా బలం న్యూస్ :-మెదక్ జిల్లా ఎస్పీ కార్యాల‌యం భ‌వంతి పూర్తైన భూసేక‌ర‌ణ పేరుతో అరాచ‌కం!కొందరు ప్రజా ప్రతినిధుల ఆదేశాలతో తోట ధ్వంసం!పోలీస్ కార్యాల‌య అందాన్ని త‌గ్గిస్తుంద‌ని ప‌చ్చ‌ని తోట తొల‌గింపు!ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండా జేసీబీ తో చెట్లు కూల్చిన వైనంహైద‌రాబాద్: సినిమా క‌థ..,మెద‌క్ ప‌ట్ట‌ణంలో రిపీట్ అయింది. మనం చూసిన కొన్ని సినిమాల్లో పెత్తందారుడి ఇంటి స‌మీపంలో చిన్న గుడిసె ఉంటే, ఇంటి అందం పోతుంద‌ని దౌర్జ‌న్యంగా గుడిసె తొల‌గించే విల‌నిజం చూశాం . అదే మాదిరి ప్ర‌భుత్వం కార్యాల‌యం అందాన్ని దెబ్బ‌తీస్తోంద‌ని ఓ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టు మామిడి తోట‌ను ధ్వంసం చేసిన ఘ‌ట‌న మెద‌క్ ప‌ట్ట‌ణంలో చ‌ర్చాంశ‌నీయంగా మారింది. ఆర్డీఓ సాయిరాంలు చట్టన్నీ అతిక్రమించి చెట్లను తొలగించడం మెదక్ పట్టణం లో దుమారం రేపుతోంది.
బాధితుడు విలేకరి దేవన్న కు ఎలాంటి నోటీసులు ఇవ్వ‌కుండానే ఆదివారం (19.03.2023) దౌర్జ‌న్యంగా మామిడి తోట‌లోని చెట్ల‌ జేసీబీతో కూలదోసి తొక్కిచ్చి ధ్వంసం చేశారు. అస‌లు విష‌యానికి వ‌స్తే -ఆయ‌న‌ పేరు జి.దేవ‌న్న. ద‌ళితుడు. ఆయ‌న ఉమ్మ‌డి మెద‌క్ జిల్లాలో మొట్ట‌మొద‌టి విలేక‌రి – ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వ దృష్టికి తీసుకెళ్ల‌డంలో స‌క్సెస్ రిపోర్టుర్. జ‌ర్న‌లిజ‌మే నా ఊపిరి అన్న‌ట్లుగా జీవ‌నం సాగించారు. 1987 నుంచి ఆయనకు ఉన్న 35 కుంట‌ల భూమిలో సాగు చేసుకుంటున్నారు. ఆయ‌న ప్ర‌ధాన వృత్తి విలువ‌ల‌తో కూడిన విలేక‌రి అయితే , ప్ర‌వృత్తి గా వ్య‌వ‌సాయంగా మార్చుకున్నాడు. ఇప్పుడు ఆయ‌న వ‌య‌స్సు 75 ఏళ్ల , అయినా ప్రజా స‌మ‌స్య‌ల‌ను వెలుగులోకి తీసుకురావ‌డానికి ఫ్రీలాన్స్ జ‌ర్న‌లిస్టుగా కొన‌సాగుతున్నాడు. అంతాబాగుంది అన్న సమ‌యంలో ఆయ‌న జీవితంలో పిడుగుప‌డినంత ప‌నైంది. సుమారు 36 ఏళ్లుగా సాగుచేసుకుంటున్న 35 కుంట‌ల మామిడితోట‌పై కొంద‌రు పెత్తందారుల కన్నుపడింది.ఈ క్రమంలోనే ఓ ప్రణాళిక ప్రకారం మామిడి తోటను ధ్వంసం చేశారు. 2018లో ఎస్పీ బంగ్లా నిర్మాణానికి భూసేక‌ర‌ణ‌ కోసం ప్ర‌భుత్వం నోటిఫికేష‌న్ జారీ చేసింది. ఆ ప్రాంతంలోని 49 ఎక‌రాల భూమిని సేక‌రించింది. ఆ త‌రువాత‌ కేవ‌లం 10 గుంటల్లో ఎస్పీ బంగ్లాను నిర్మించింది. రాజ‌కోట‌ను తలపిస్తున్న ఈ భ‌వ‌న స‌మీపంలోనే ఉన్న(దేవన్న) మామిడితోట ఎస్పీ బంగ్లా అందానికి అడ్డుగా మారింద‌ని-ఎస్పీ భావించార‌ట‌.ఈ క్ర‌మంలోనే సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ దేవ‌న్న తోట‌ను తొల‌గించాల‌ని భావిస్తున్న పెత్తందారులకు ఆ నోటా ఈ నోటా ఈ మాట చేరిందట. ఈ విషయాన్ని బడ నాయకుల ప్రాజప్రతినిదులో చెవిలో పడింది. ఇక అదే అదునుగా భావించిన కొందరు బడా నాయకులు ఎలాగైనా తోట‌ను తొల‌గించాల‌ని ఆర్డీఓకు ఆదేశించారట. భూసేక‌ర‌ణ కోసం 2022నోటిఫికేష‌న్ ఇచ్చారు . ఈ విష‌యం తెలుసుకున్న దేవ‌న్న హైకోర్టును ఆశ్ర‌యించారు.హై కోర్టు స్టే ఇచ్చింది.ఈ కేసు విషయంలో వాద‌న‌లు న‌డుస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే కేసు డిస్మిస్ అయింద‌ని పెత్తందారులు విషప్ర‌చారం మొదలు పెట్టారు. ఏ మాత్రం హైకోర్టు ఆర్డ‌ర్ కూడా లేకుండానే , కీలక ప్రజా ప్రతినిధి , ఆర్డీఓ, పోలీసుడిపార్ట్మెంట్ కు తోట‌ను స‌రండెర్ చేసిన‌ట్లు ప్ర‌చారం చేశారు. ఇక జిల్లా పోలీస్ బాస్ ఆదేశాల‌తో డీఎస్పీ , ఇద్ద‌రు సీఐలు, వందల సంఖ్యలో పోలీసులు మామిడి తోట వ‌ద్ద కు చేరి హల్చల్ చేశారు. జేసీబీతో మామిడితోట గేటును కూల‌ కొట్టారు.మామిడి తోట ఫినిషింగ్ తొల‌గించారు. హైకోర్టు నుంచి ఆదేశాలు రాద‌ని తెలుసుకుని నాలుక కరుచుకున్న పోలీసులు – ఆ తరువాత తోట‌లోనిచెట్ల‌ జోలికి వెళ్లకుండా వెళ్లిపోయారు. ఈ విష‌యం తెలుసుకున్న మెదక్ బడ నాయకులు చిర్రతిందట. సినిమా స్టైల్ లో ఆయన రంగంలోకి దిగారు. ఆదివారం సెలవు రోజు అనికూడా చూడకుండా ఆర్డీవోను వెంటపెట్టుకుని మామిడి తోట వద్దకు చేరాడు. జేసీబీని తెప్పించి పచ్చని తోటను ధ్వంసంచేయించారు. ఈ అరాచకాన్ని చూసిబాధిత జర్నలిస్టు దేవన్న కట తడిపెట్టుకున్నారు. మనో వేదనతో ఇంటికి పరిమితం అయ్యారు. ఎంతో మంది బాధితుల పరిస్థితిని తన వార్తల రాతల ద్వారా ప్రజా సేవ చేసిన ఆయన తన విషయం లో అన్యాయం జరుగుతున్న అడ్డుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఆధునిక సమాజంలో చట్టాన్ని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాలతో అక్రమణలకు అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. భూసేకరణ పేరుతో అవసరాన్నిమించి అనవసరంగా భూమి దోపిడిపై పోరాడాలని ఆయన పిలుపునిస్తున్నారు. ఈవిషయం పై ఇంత గోరమని ధలిత సంఘాలు మండీ
పడుతున్న రు. దళిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking