గుండెపోటుతో,నీటిలో మునిగి మరణించిన హెడ్ కానిస్టేబుల్ ల కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేత

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం పోలీస్ కమీషనర్ ఐపిఎస్(ఐజీ)ఎం శ్రీనివాస్

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 27 : రామగుండం పోలీస్ కమిషనరేట్ ఆర్ముడ్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్  గా విధులు నిర్వహిస్తూ డి.మల్లయ్య ఎ ఆర్ ఎచ్ సి.2836 కెనాల్ నీటిలో మునిగి మరణించగా ఆయన భార్య హేమలత,కుమార్తె శ్రీజ లకి భద్రత ఎక్స్గ్రేషియా చెక్ 8 లక్షలు గోదావరిఖని 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తూ గుండెపోటు తో మరణించిన బి.సోమరాజు హెడ్ కానిస్టేబుల్ భార్య శోభరాణి, కుమార్తె సాయి ప్రియలకు లకి  భద్రత ఎక్స్గ్రేషియా  15,99,160 లక్షల చెక్ ను ఈ రోజు రామగుండం పోలీస్ కమీషనర్ ఐపిఎస్ (ఐజీ)ఎం. శ్రీనివాస్ ఐపిఎస్ తన కార్యాలయం లో వారికి అందజేయడం జరిగింది. శనివారం ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు,వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని సీపీ అన్నారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు,ఏఆర్ ఏసీపీలు ప్రతాప్,సురేంద్ర,ఏఓ అశోక్ కుమార్,సూపరింటెండెంట్ సంధ్య తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking