రామగుండం పోలీస్ కమీషనర్ ఐపిఎస్ ఐజీ ఎం శ్రీనివాస్
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 27 : రామగుండం కమిషనరేట్ పరిధి పెద్దపల్లి,మంచిర్యాల జోన్ ల పరిధిలో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల ప్రచార కార్యక్రమాలకు వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన వివిఐపి,విఐపి,లు హెలికాప్టర్ల ద్వారా రావడం జరుగుతుంది. కావున డ్రోన్ వినియోగం పై నిషేధాజ్ఞలు విధిస్తూ శనివారం రామగుండం పోలీస్ కమిషనర్ ఐపిఎస్ (ఐజీ)ఎం శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.ఎవరైనా నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్ వినియోగం చేసినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని సిపి తెలిపారు.