కీ,,శే రఘుపతి రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలు ప్రారంభోత్సవం

 

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 27 : మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల మున్సిపాలిటీలో బస్టాండ్ వద్ద,మార్కెట్,ఐ.బి చౌరస్తా,హమాలివాడ,
ఓవర్ బ్రిడ్జ్ వద్ద,బెల్లంపల్లి చౌరస్తా ఏరియాల్లో చలివేంద్ర కేంద్రాలను ప్రారంభించిన ట్రస్ట్ సెక్రటరీ కొక్కిరాల సత్యపాల్ రావు,రుక్మిణి ప్రారంభించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…మా నాన్నగారు పేరు మీద కొక్కిరాల రఘుపతి రావు ట్రస్ట్ ప్రారంభించడం జరిగింది,ఈ టెస్ట్ ద్వారా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలకు10 సంవత్సరాలు సేవా కార్యక్రమాలు అందిస్తామని చెప్పడం జరిగింది.అందులో భాగంగా చలివేంద్రాలు,అంబలి పథకాలు,పట్టు చీరలు,ఇతర కార్యక్రమాలు,చేయడం జరుగుతుంది.ఇది 6 సంవత్సరం పూర్తి అయింది. ఇంకా 4 సంవత్సరాలు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా దేవుని ఆశీస్సులు,మీ ఆశీస్సులు ఉంటే ఇంకా ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎఐసిసి మెంబర్ చిట్ల సత్యనారాయణ,మంచిర్యాల పట్టణ అధ్యక్షుడు తుమ్మల నరేష్,మంచిర్యాల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదారి తిరుపతి కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking