పార్టీలోకి ఆహ్వానించిన చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి
మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 27 : మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ పట్టణంలోని ఆదర్షనగర్ కాలనీలో కార్నర్ మీటింగ్ నిర్వహించిన చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి.పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.చెన్నూర్ మండలానికి చెందిన సుమారు 100 మంది బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది.వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన వివేక్ వెంకట స్వామి,ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీష్,సూర్య నారాయణ,రాజీ రెడ్డి,స్థానిక కాంగ్రెస్ నాయకులు సుద్దపల్లి సుశీల్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.