కాంగ్రెస్ కు ఓటేస్తే ప్రజల పాలు

 

బీఆర్ఎస్,బీజేపీకి ఓటు వేస్తే గంగా పాలు

కాంగ్రెస్ నాయకుడు మూల కిషన్ గౌడ్

పార్లమెంట్ ఎలక్షన్ లో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ప్రజలు బాగుపడతారని,బీఆర్ఎస్, బీజేపీకి ఓటు వేస్తే ఆ ఓటు గంగ పాలవుతుందని మోదెల కాంగ్రెస్ నాయకులు మూల కిషన్ గౌడ్ పేర్కొన్నారు.శనివారం పలు వార్డులలో కాంగ్రెస్ నాయకులతో కలిసి ఇంటింటి ప్రచారం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కాంగ్రెస్ అమలు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ప్రజలకు వివరించారు.పెద్దపల్లి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ చేతి గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు.రాబోయే రోజులలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తుందని తెలిపారు.ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ను ఆదరించినట్టుగా వంశీ కృష్ణ ను ఆదరించాలని ప్రజలను కోరారు.బీఆర్ఎస్,బీజేపీ కి తగిన గుణపాఠం చెప్పాలని ప్రచారం చేశారు.ఈ కార్యక్రమంలోమూల లచ్చన్న గౌడ్,బాకం లచ్చన్న, తోట రమేష్,తోట తిరుపతి,తోట చంద్రశేఖర్,మూల గంగాధర్, శాతరాజు రాజేష్,శాతరాజు శివ,మగ్గిడి రాజేష్,కుమ్మరి తిరుపతి,తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking