కాకతీయ జూనియర్ కళాశాలలో అలరించిన వీడ్కోలు వేడుకలు.

ప్రతి విద్యార్థి ఉన్నత శిఖరాలను చేరుకోవాలి.
కాకతీయ విద్యాసంస్థల అధినేత అవిర్నేని సుధాకర్ రావు.

జమ్మికుంట ప్రజాబలం
జనవరి 27

జమ్మికుంట పట్టణంలోని స్థానిక సువర్ణ పంక్షన్ హల్ లో శనివారం కాకతీయ జూనియర్ కళశాల విద్యార్థుల వీడ్కోలు సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కాకతీయ విద్యాసంస్థల అధినేత అవిర్నేని సుధాకర్ రావు హాజరై జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమం ప్రారంభించారు..ఈ సందర్భంగా కాకతీయ విద్యాసంస్థల చైర్మన్, కరస్పాండెంట్ అవిర్నేని సుధాకర్ రావు మాట్లాడుతూ… ప్రతి ఒక్క విద్యార్థి,కళాశాలలో నేర్పిన క్రమశిక్షణతో జీవితం లో ఉన్నతమైన శిఖరాలను అధిరోహించాలని ఆకాక్షించారు.పెరుగుతున్న పోటీ ప్రపంచంలో సమయం వృధా చేయకుండా విద్యార్థులు లెక్చరర్స్ చెప్పినవి చదివి మంచి మార్కులు తీసుకువచ్చి తల్లిదండ్రులకు, విద్యనేర్పిన గురువులకు కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు.దేశం లో మహిళలకే ఉన్నతాధికారం ఉందని దేశానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, తెలంగాణ రాష్ట్రం లో గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్, అలాగే కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కూడా మహిళలు అని, వారిని స్పూర్తి గా తీసుకొని అలాంటి అవకాశాలు పొంది ఉన్నత శిఖరాలని అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు… గత విద్య సంవత్సరం తో పోలిస్తే 20రోజులు ముందుగా పరీక్షల టైం టేబుల్ వచ్చిందని కాబట్టి ప్రతి విద్యార్థి సమయం వృధా చేయకుండా పూర్తి స్థాయిలో సెలబస్ చదివి మంచి ర్యాంకులు,మార్కులు తీసుకురావాలని అన్నారు… 2023 విద్యాసంవత్సరం లో వార్షిక పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఎంపిసి విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు సాధించి హుజురాబాద్ డివిజన్ టాపర్ గా అనిలిచిన కీర్తి ప్రసన్న ,అక్షయ నందిని 461, బిపిసి విభాగం లో 440 మార్కులకు గాను 433 మార్కులు సాధించి జమ్మికుంట మండల్ టాపర్ గా నిలిచిన జైనాబ్ అఫ్రీన్ ,సీఈసీ విభాగంలో 500 మార్కులకు గాను 465 మార్కులు సాధించి జమ్మికుంట మండల్ టాపర్ గా నిలిచిన కోమల విద్యార్థులకు బహుమతి ప్రధానం చేసి వారిని ప్రోత్సహించారు…. అనంతరం వివిధ పాటలకు విద్యార్థులు చేసిన నృత్యాలు అధ్యాపకులను, విద్యార్థులను అలరించాయి..ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ జెర్రిపోతుల రవిబాబు, అవిర్నేని శ్రీనివాస్ రావు, అధ్యాపకులు దేవేందర్రావు,మనీషా,శ్రావణి,మౌనిక, వంశీ,శ్రీనివాస్,రమేష్,దేవేందర్,సాయి కృష్ణ,సాయి శ్రీనివాస్,విద్యార్థులు పాల్గొన్నారు..

     

Leave A Reply

Your email address will not be published.

Breaking