పోలీస్ కమీషనర్ విష్ణు యస్.వారియర్ కు ఆత్మీయ వీడ్కోలు

 

ఖమ్మం ప్రతినిధి జనవరి 8 (ప్రజాబలం) ఖమ్మం బదిలీపై కేంద్ర సర్వీసులకు వెళ్తున్న పోలీస్ కమీషనర్ విష్ణు యస్. వారియర్ కు ఖమ్మం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు సమావేశం నిర్వహించారునగరంలోని కెఎల్ సి లో జరిగిన కార్యక్రమంలో జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు, మినిస్ట్రీయల్ స్టాఫ్, పోలీసు సిబ్బంది హాజరై ఘనంగా సన్మానించారుపలువురు పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఉద్యోగులకు బదిలీలు సర్వసాధారణ మైనప్పటికిశాంతిభద్రతలు తనదైన శైలిలో పరిరక్షిస్తూ ప్రజలకు దగ్గరయ్యేలా బాధితులకు అండగా నిలవాలనే ఐడియాలజీతో తాను పనిచేస్తూ జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సమన్వయం పరుస్తూ విజయవంతంగా ముందుకు నడిపించిన జిల్లా పోలీస్ అధికారి బదిలీ కావటం కొంత బాధాకరమని అన్నారు కీలకమైన కేంద్ర సర్వీస్ విభాగానికి వెళ్తున్న పోలీస్ కమిషనర్ మరిన్ని విజయాలు సాధించాలని అకాంక్షించారు
ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ సిబ్బంది తనపై చూపిన అభిమానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో పోలీస్ యంత్రాంగం మరింత సమర్థవంతంగా పని చేయాలన్నారు. జిల్లాతో ఉన్న అనుబంధాన్ని, మీ అందరి సహకారాన్ని ఎన్నటికీ మరువలేనని అన్నారు. మరో రెండు రోజుల్లో కేంద్రం సర్వీస్ లోని కీలక విభాగంలో భాధ్యతలు తీసుకునేందుకు వెళ్తున్నట్లు తెలిపారు కార్యక్రమం ఆనంతరం ఆయనపై పూల వర్షం కురిపిస్తూ పోలీస్ సిబ్బంది అభిమానాన్ని చాటుకున్నారు అడిషనల్ డీసీపీ ప్రసాద్ రావు, ఏసీపీలు గణేష్, హరికృష్ణ, ప్రసన్న కుమార్, భస్వారెడ్డి రహెమాన్ రామనుజం శివరామయ్య రవి నర్సయ్య సుశీల్ సింగ్, ఆర్ ఐలు, సిఐలు, ఎస్సేలు, సెక్షన్ సూపరిండెంట్ జానకీరాం పాల్గొన్నారు.

 

Leave A Reply

Your email address will not be published.

Breaking