రైతుల అభిప్రాయ మేరకు రైతు భరోసా విధివిధానాలు

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జులై 11 : రైతుల అభిప్రాయాలు సూచనలు సలహా మేరకు రైతు భరోసా పథకం విధి విధానాలు రూపొందించి అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష నాయకులతో సమన్వయం చేసుకుంటూ పథకాన్ని అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు విక్రమార్క అన్నారు. గురువారం ఉట్నూర్ లో ఏర్పాటు చేసిన రైతు భరోసా కమిటీ ఉమ్మడి జిల్లా అదిలాబాద్ జిల్లాస్థాయి సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ,మార్కెటింగ్, సహకార,చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు,రాష్ట్ర రెవెన్యూ,హౌసింగ్ సమాచార శాఖ,మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణ అభివృద్ధి,సంక్షేమ శాఖల, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి సీతక్క, అదిలాబాద్ పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్,మంచిర్యాల కుమార్ దీపక్,కొమరం భీమ్ ఆసిఫాబాద్ వేంకటేష్ ధోత్రే,అదిలాబాద్ రాజర్షి షా, నిర్మల్ జిల్లా అభిలాష అభియాన్ లు,సమగ్ర గిరిజన నాభీవృద్ది సంస్థ – ఉట్నూర్ ప్రాజెక్ట్ అధికారి ఖుష్పు గుప్తా, అదనపు కలెక్టర్లు,శాసనమండలి సభ్యులు దండే విటల్, మంచిర్యాల శాసనసభ్యులు కోక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, చెన్నూరు శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకట స్వామి,అశ్వ బాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి,సిర్పూర్ శాసన సభ్యులు పాల్వాయి హరిష్, ఖానాపూర్ శాసన సభ్యులు వెడ్మ బోజ్జు లతో కలిసి హాజరయ్యారు.ఈ సందర్భంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి,ఆర్థిక ఇంధన మనరుల శాఖ మంత్రి మాట్లాడుతూ…రైతుల సంక్షేమం కోసం రైతుల అభిప్రాయఅను పరికరంలోకి తీసుకొని భరోసా కార్యక్రమాన్ని నిర్దిష్టంగా అమలు చేయడం జరుగుతుందని,ప్రజలు, రైతులు,మేధావులు,ప్రముఖులు, నుండి సేకరించిన అభిప్రాయాలు, సలహాలు,సూచనలతో అన్ని జిల్లాలను క్రీడీకరించి చట్ట సభలలో ప్రస్తావనకు తీసుకువచ్చి ఈ అంశంపై చర్చించడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర వరుణులు, సంపదను ప్రజా సంక్షేమానికి, రాష్ట్ర అభివృద్ధికి వినియోగిస్తామని,ప్రజలు, రైతులు ప్రత్యక్షంగా, పరోక్షంగా,తమ కష్టారితం నుంచి చెల్లించిన పన్ను,వివిధ రంగాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సమకూర్చిన ఆదాయం నుండి ప్రజల కష్టాన్ని న్యాయం చేస్తామని అన్నారు.రైతు భరోసా పథకంలో రైతులకు లబ్ధి చేకూరే విధంగా కృషి చేయడం జరుగుతుందని తెలిపారు.రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్, సహకార చేనేత జౌళి శాఖల మంత్రి మాట్లాడుతూ…రైతు భరోసా అమలు చేయడంలో ప్రతి ఒక్కరి అభిప్రాయానికి ప్రాథమిక ఇస్తామని,అందరి అభిప్రాయాలను కూడికరించి సముచిత ప్రణాళిక ద్వారా రైతు సంక్షేమానికి కృషి చేస్తామని తెలిపారు. ప్రభుత్వం నుండి ఏ కార్యక్రమం చేపట్టిన ప్రజా సంక్షేమంలో సూచనలు,సమ్మతి తో అమలు చేయడం జరుగుతుందని,ప్రజా ధనాన్ని ప్రజలకు ప్రతి నిధులకు న్యాయబద్ధంగా అర్హత గల ప్రతి ఒక్కరికి అందే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఉమ్మడి అదిలాబాద్ జిల్లాలోని సరైన పత్రాలు లేకుండా సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రైతుల సంక్షేమంపై దృష్టి సాధిస్తామని తెలిపారు. రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ, జిల్లా ఇంచార్జ్ మంత్రి మాట్లాడుతూ… ప్రజాధనాన్ని ప్రజల అవసరాల మేరకు మాత్రమే వినియోగించేందుకు ప్రభుత్వం కార్యచరణ అమలు చేస్తుందని తెలిపారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా పరిధిలోని ఆయా నియోజకవర్గాలు, మున్సిపాలిటీల వారిగా పెండింగ్ సమస్యలు, ప్రాజెక్టులు, అటవీ ఇతర అన్ని సమస్యల పరిష్కారం కొరకు వీలైనంతవరకు అక్కడికక్కడే పరిష్కరించే విధంగా ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. మెరుగుపరిచే విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందని, అన్ని రంగాలకు సమ ప్రాధాన్యతనిస్తూ బడ్జెట్లో కేటాయింపులు చేయడం జరుగుతుందని తెలిపారు. వ్యవసాయ భూమిలో కాళ్లు చెమటోడ్చి సాగు చేసే రైతులకు న్యాయం జరిగేలా విధి విధానాలు రూపొందిస్తున్నామని, నిబంధన ప్రకారం అర్హత కలిగిన సాగు రైతులకు పట్టాలు అందించడం పై ప్రభుత్వం ఆలోచిస్తుందని అన్నారు. సమావేశంలో రైతులు,రైతు సంఘాల నాయకులు, శాస్త్రవేత్తలు,న్యాయవాదులు, వైద్యులు,జర్నలిస్టులు, ప్రముఖులు,పలు రంగాలకు చెందిన వారు తమ అభిప్రాయాలను వ్యక్తంపరచడం జరిగింది.వ్యవసాయ క్షేత్రంలో సాగు చేసే రైతులకు మాత్రమే రైతు భరోసా వర్తింపజేయాలని , చిన్న, సన్న కారు రైతులకు న్యాయం చేయాలని,ఏజెన్సీ ప్రాంతాలలో సాగు చేస్తున్న నిజమైన రైతులకు భరోసా వర్తింప చేయాలని, 10 ఎకరాల వ్యవసాయ భూమికి పరిమితి విధించాలని, అన్ని పంటలకు బోనస్ అందించాలని,కౌలు రైతులకు సంక్షేమంపై ఆలోచించాలని అనేక అభిప్రాయాలను వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఉమ్మడి అదిలాబాద్ జిల్లా అధికార యంత్రాంగం,ప్రజా ప్రతినిధులు,రైతులు,రైతు సంఘాల నాయకులు,వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking