ఖమ్మం ప్రతినిధి జనవరి 07 (ప్రజాబలం) ఖమ్మం పట్టణం బైపాస్ రోడ్డులోని స్థానిక కరుణగిరి కాంప్లెక్స్ నందు బిషప్ హౌస్ ప్రొక్రేటర్ ఫాదర్ ఐజక్ చే హోలీల్యాండ్ టూర్ అనగా యెరూషలేము యాత్రకు వెళ్ళదలచిన క్రైస్తవ విశ్వాసులకు మార్గదర్శకం చేయుటకు కార్యాలయము ప్రారభించబడినది యెరూషలేము యాత్రకు వెళ్లాలని అనేక క్రైస్తవ విశ్వాసులకు ఆశా ఆసక్తి ఉన్నప్పటికీ ఎలా వెళ్లాలో తెలియక చాలామంది ఇబ్బంది పడుతున్నారని ఇలాంటి కార్యాలయం అందుబాటులో ఉండుట వలన అందరికి అనుకూల మరియు సుళువైన విధంగా మార్గం సుగమనమౌతుందని భావించి క్రైస్తవ విశ్వాసులందరు ఈ మంచి అవకాశం వినియోగించుకుంటే మంచిదని ఫాదర్ ఉపన్యసించారు . కార్యాలయము నిర్వాహకులు డాక్టర్ మాచర్ల శేఖర్ బాబు మాట్లాడుతూ యెరూషలేము యాత్రలో ఇశ్రాయేల్ దేశంతో పాటు ఈజిప్ట్ పాలస్తీనా మరియు జోర్ధాన్ అను మొత్తం నాలుగు దేశాలలో పరిశుద్ద బైబిల్ గ్రంధములోని అనేక పవిత్ర స్థలాలను చూపిస్తూ వాటి ప్రాముఖ్యతను సంపూర్ణంగా వివరిస్తూ ఈ యాత్ర ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమము లో పాస్టర్ శ్యామ్ బాబు బ్రదర్ కరుణాకర్ బ్రదర్ ప్రభాకర్ బ్రదర్ రాఘవులు బ్రదర్ ఛారి బ్రదర్ యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు