పొంగులేటి కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కోరం కనకయ్య మేకల మల్లిబాబు యాదవ్

ఇల్లందు ప్రతినిధి జనవరి 07 (ప్రజాబలం) తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని హైదరాబాదులోని వారి క్యాంప్ ఆఫీస్ లో ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లి బాబు యాదవ్ మర్యాదపూర్వకంగా కలిసి నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఇల్లందు నియోజకవర్గ అభివృద్ధి, ఖమ్మం జిల్లాలోని యాదవుల సమస్యలపై వివరించగా సానుకూలంగా పొంగులేటి స్పందించి ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ పార్టీ హయాంలో ఈ విధంగా అయితే 6 గ్యారంటీల పథకాల అమలు జరుగుతూ ఉన్నదో, బడుగు బలహీన వర్గాల సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధికి కట్టుబడి ఉన్నదో, కాంగ్రెస్ పార్టీకి వెన్నంటి ఉండిన యాదవుల సమస్యలను ఇప్పటికే గుర్తించామని, తప్పకుండా, త్వరలో అందరికీ న్యాయం చేకూర్చే విధానం ప్రకటిస్తామని హామీ ఇచ్చారని మల్లి బాబు యాదవ్ తెలిపారు ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు షేక్ ఫతే మహమ్మద్, బానోత్ చింతు, మూల మధుకర్ రెడ్డి, చేపల శ్రీను, కంబాల ముసలయ్య, రాసాల నాగేశ్వర్రావు మరియు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking