మేడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్ రాధిక గుప్తా
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జనవరి 7:మంగళవారం రోజున ఆపరేషన్ స్మైల్- Xl వివిధ శాఖలతో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ ప్రాంగణంలో ముఖ్యఅతిథిగా స్థానిక సంస్థల అదునపు కలెక్టర్ రాధిక గుప్తా ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ అందరి తో సమన్వయంతో బాలల రక్షణకు వారి భద్రతకు సహకారం అందించాలని కోరారు. జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత మాట్లాడుతూ 14 సంవత్సరాల లోపు ఉన్న బాల కార్మికులు గాని పనిచేస్తూ బాలలను వివిధ పారిశ్రామిక వాడల్లో గాని పిల్లల భిక్షాటన గాని అక్రమ రవాణా, బాలల నిర్వ స్థితి ప్రాంతాల నుంచి కాపాడి, వారికి విముక్తి కల్పించాలని, బాలలకు వెలుగులు నింపాలని అన్నారు, బాలల చేత పనిచేసుకుంటున్న యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ మెంబర్ రామ్మోహన్ మాట్లాడుతూ బాలల రక్షణ మరియు వారి సంరక్షణ కొరకు ఈ నెల జనవరి 1 నుంచి 31,2025 వరకు 24×7 గంటలు అందుబాటులో ఉంటామని ఆపరేషన్ స్మైల్-Xl నిర్వహించడం వలన బాలలకు ఎంతగానో తోడ్పడినందిస్తుందని తెలియజేశారు. ఇందులో వివిధ శాఖల అధికారులు సైబరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారులు, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు, డి ఎం అండ్ హెచ్ ఓ అధికారి రఘునాథ స్వామి, రెవిన్యూ అధికారులు, బాల రక్ష భవన్ కోఆర్డినేటర్ నాగమణి, జిల్లా బాలల పరిరక్షణ అధికారి ఎండి ఇంతియాజ్ రహీం, జిల్లా బాలల పరిరక్షణ విభాగ సభ్యులు, చైల్డ్ లైన్ సభ్యులు, మరియు వివిధ శాఖల అధికారులు వివిధ స్వచ్ఛంద సంస్థల్లో పాల్గొన్నారు.