గెలుపు కంటే పోరాటం ముఖ్యం రాచకొండ కమిషనర్  సుధీర్ బాబు ఐపీఎస్

 

క్రీడలు వ్యక్తుల మానసిక, శారీరక వికాసానికి ఎంతో అవసరం: సీపీ సుధీర్ బాబు ఐపీఎస్

సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో రాచకొండ పోలీస్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభం

క్రీడలు వ్యక్తుల మానసిక వికాసానికి మరియు శారీరక వికాసానికి తోడ్పడుతాయని రాచకొండ కమిషనర్  సుధీర్ బాబు ఐపీఎస్ పేర్కొన్నారు.

ఈరోజు సరూర్ నగర్ లోని ఇండోర్ స్టేడియంలో ప్రారంభమైన ఐదో రాచకొండ పోలీస్ కమిషనరేట్ వార్షిక స్పోర్ట్స్ మీట్-2024 ప్రారంభ కార్యక్రమంలో కమిషనర్ మాట్లాడుతూ క్రీడలు మన జీవితంలో ముఖ్య భాగం అని, వివిధ రకాల మానసిక శారీరక ఒత్తిడులను అధిగమించడానికి క్రీడలు ఎంతో ఉపకరిస్తాయని పేర్కొన్నారు. రాచకొండ కమిషనరేట్ పోలీస్ సిబ్బందికి తమ విధి నిర్వహణలో ఎదురయ్యే ఒత్తిడులను మరియు వివిధ రకాల సవాళ్ల నుంచి ఉపశమనం పొందేలా మరియు నూతనత్తేజంతో తమ విధి నిర్వహణలో పాల్గొనేలా చేయడానికి స్పోర్ట్స్ మీట్ ఎంతగానో ఉపయోగపడుతుంది అన్నారు. ఈ క్రీడా పోటీల ద్వారా వివిధ రకాల పోలీస్ విభాగాల మధ్య సుహృద్భావ వాతావరణం మరియు సమిష్టితత్వం ఏర్పడుతుందన్నారు. ఈ పోటీల్లో అన్ని రకాల ప్రధాన క్రీడా విభాగాల్లో పోటీలు నిర్వహిస్తామని, మొత్తం ఎనిమిది జట్లు తలపడనున్నాయని, మినిస్టిరియల్ సిబ్బందికి కూడా ఒక ప్రత్యేక జట్టు ఉంటుందని పేర్కొన్నారు. అన్ని జట్లూ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించాలని. గెలుపు ఓటముల కంటే పోరాటమే ధ్యేయంగా క్రీడల్లో పాల్గొనాలని పేర్కొన్నారు. రాచకొండ పరిధిలో పనిచేస్తున్న అన్ని పోలీసు విభాగాల సిబ్బంది మరియు మినిస్టీరియల్ సిబ్బంది కూడా ఈ పోటీల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు.

తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను చిన్న వయసు నుంచే క్రీడలలో ప్రోత్సహించాలని, క్రీడల ద్వారా వచ్చే శారీరక మానసిక వికాసం ద్వారా వారి పిల్లలు విద్యలో మరింత మెరుగ్గా రాణించే అవకాశం ఉందని పేర్కొన్నారు. క్రీడల ద్వారా కొన్నిసార్లు విద్యలో కొంతవరకు మార్కులు తగ్గినా అంతిమంగా క్రీడలు విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి తోడ్పడుతాయని పేర్కొన్నారు. క్రీడల ద్వారా నేర్చుకునే పోటీ తత్వం మరియు పోరాట తత్వం భవిష్యత్తులో ఎదురయ్యే వివిధ రకాల సవాళ్లను అధిగమించడానికి ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

కార్యక్రమంలో భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర ఐపీఎస్, ఎస్ఓటీ డీసీపీ 1 గిరిధర్ రావుల ఐపీఎస్, ఎల్బీనగర్ డిసిపి ప్రవీణ్ కుమార్ ఐపిఎస్, ఎస్ఓటి డీసీపీ 2 మురళీధర్, మహేశ్వరం డిసిపి సునీత రెడ్డి, డీసీపీ క్రైమ్స్ అరవింద్ కుమార్, డీసీపీ అడ్మిన్ ఇందిరా, ఎస్బీ డీసీపీ కరుణాకర్, ట్రాఫిక్ డిసిపిలు, అడిషనల్ డిసిపిలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking