డీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరుకంటి సురేష్.
లక్షెట్టిపేట నూతన మండల కమిటీ ఎన్నిక.
ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి జనవరి 31 : జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఫిబ్రవరి 6న హైదరాబాద్లో జరిగే డీజేఎఫ్ మహాసభను విజయవంతం చేయాలని డీజేఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి కోరుకంటి సురేష్ పిలుపునిచ్చారు. బుధవారం లక్షెట్టిపేట పట్టణంలోని విశ్రాంతి భవనంలో మహాసభ పోస్టర్లను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ…ఎన్నో అవంతరాలను ఎదుర్కొని సమాజ సేవ చేసేది జర్నీలిస్టులేనన్నారు.ప్రభుత్వం ద్వారా అమలయ్యే సంక్షేమ పథకాలను జర్నలిస్టులకు అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిథి అనపర్తి కుమారస్వామి,ఉపాధ్యక్షులు కుషణపల్లి సతీష్,జిల్లా నాయకులు పిట్టల సతీష్ పాల్గొన్నారు.ఈసందర్భంగా మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మండల అధ్యక్షులుగా రాంపల్లి మధుకర్,మండల ప్రధాన కార్యదర్శి బైరం లింగన్న, ఉపాధ్యక్షులు చీకాటి తిరుపతి,మేడి భానుచందర్, సహాయ కార్యదర్శి బోనవేని సందీప్,కోశాధికారి బోరే రమేష్,ప్రచార కార్యదర్శి శనిగారపు శ్రీకాంత్,గౌరవ అధ్యక్షులు ప్రసన్న,ప్రధాన సలహాదారు అల్లంపెళ్లి రమేష్ ను ఎన్నుకున్నారు.ఈ కార్యక్రమంలో డిజెఎఫ్ సభ్యులు శ్రీకాంత్,రాకేష్,శివ ప్రసాద్,సతీష్,రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.