పట్టల పంపిణీ కై వినతి పత్రం

 

జమ్మికుంట ప్రజా బలం ప్రతినిధి ఫిబ్రవరి 01

జమ్మికుంట తాసిల్దార్ కి పట్టల పంపిణీ కేటాయించడం కొరకై వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జడ్పిటిసి డాక్టర్.శ్రీరామ్ శ్యామ్ మాట్లాడుతూ సైదాబాద్ గ్రామ పరిధిలో గల సర్వేనెంబర్ 234 గతంలో సైదాబాద్ గ్రామ ప్రజలకు పట్టాలు పంపించడం జరిగింది. కొన్ని కారణాలవల్ల భూమి కేటాయింపు జాప్యం చేయడం జరిగింది. మాజీ ఎమ్మెల్సీ ప్రస్తుత హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి గత మూడు నెలల క్రితం భూమి కేటాయింపు పత్రాలు ఇచ్చినప్పటి కూడా మోక్షం లేదని వారు గుర్తు చేశారు. దీనికి సంబంధించి జమ్మికుంట తాసిల్దార్ రజనికి వినతిపత్రం జరిగింది. లబ్ధిదారులు ఇండ్ల నిర్మాణ కొరకు వాటికి కావలసిన సామాగ్రిని కొనుగోలు చేసి రోడ్డుపైన ఉన్నాయని వారు విచారణ వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు త్వరగా చొరవ తీసుకొని లబ్ధిదారులకు భూ కేటాయించాలని వారు తాసిల్దార్ కోరడం జరిగింది. సైదాబాద్ గ్రామ ప్రజలు చాలా సంవత్సరాల నుండి ఈ భూ కేటాయింపు విషయంలో అనేక ఇబ్బందులు పడుతున్నాయని వారు గుర్తు చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వ యంత్రాంగం వారికి భూమి కేటాయించాలని వారు వివరించారు. గత ప్రభుత్వం పేదల పక్షాన నిలిచిందని ఈ ప్రభుత్వం కూడా పేదల పక్షాన నిలవాలని వారు ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా సైదాబాద్ మాజీ సర్పంచ్ పుప్పాల రాజారామ్ ఉపసర్పంచ్ రాజయ్య, వార్డు సభ్యులు అరవింద్, సతీష్ మనోహర్ ,శాంత, లక్ష్మి గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking