జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ అధ్వర్యంలో లో వైద్యం కోసం ఆర్థిక సాయం

 

ప్రజాబలం ప్రతినిధి నిర్మల్ జిల్లా.. సెప్టెంబర్ 01 : జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్ అధ్వర్యంలో లో వైద్యం కోసం ఆర్థిక సాయం అందించారు.శుక్రవారం ఈ సందర్భంగా ఫౌండేషన్ సభ్యులు మాట్లాడుతూ…
కడమంచి రాజేష్ 37 సంవత్సరాలు,గ్రామం కోసంపల్లి మండలం ఖానాపూర్ జిల్లా నిర్మల్ ఈయనకు గత ఎనిమిది నెలల నుండి క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ ఆసుపత్రి వైద్యం కొరకు ఇప్పటివరకు 10 లక్షల రూపాయలు అప్పు చేసుకుని ఖర్చులు పెట్టడం జరిగింది ఇప్పుడు ఇంకా ఆరు లక్షలు అయితేనే బ్రతకడానికి అవకాశం ఉందని డాక్టర్లు చెప్పారు కానీ గవ్వ పైసా లేదు అప్పు చేసి వైద్యం తీసుకోవడం ఇప్పుడు వైద్యానికి డబ్బులు లేవు క్యాన్సర్ వచ్చిన రాజేష్ కు భార్య ముగ్గురు పిల్లలు ఉన్నారు గుడిసె జాగా మొత్తం అమ్ముకున్నారు తిందామన్నా తిండికి లేని పరిస్థితులో ఆవేదనతో బాధపడుతూ ఎవరైనా దాతలు ముందుకు వచ్చి తోచిన సాయం చేసి నా పిల్లల కొరకైనబ్రతికించడానికి అందరూ సహకరించాలని బార్య వేడుకుంటుంది
విషయం తెలుసుకున్న మన (జై జవాన్ జై కిసాన్ ఫౌండేషన్)సభ్యులు ఈ రోజు రాజేష్ వైద్యం కోసం 5 వేల రూపాయల ఆర్థిక సాయాన్ని అందజేసారు
ఇంక ఎవరైనా దాతలు యువజన సంఘాలు ముందుకు వచ్చి సాయం చేయాలని మాట్లాడారు.
సహాయం పొందిన రాజేష్ ఫౌండేషన్ సభ్యులకు ధన్యవాదాలు తెలిపాడు
ఈ సహాయ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సభ్యులు బుగ్గారం లింగన్న,కొండేరి దినేష్,విజయ్,కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking