డిమాండ్ల పరిష్కారం వరకు పోరాటం
జగిత్యాల యుఎస్పీసి నేతలు
జగిత్యాల ప్రతినిధి, సెప్టెంబర్ 1(ప్రజా బలం) హైదరాబాద్ లోని ఇందిరాపార్క్ మహాధర్నా వేదికగా తమ డిమాండ్ల సాధన కోసం పోరాటం ఆగదని జగిత్యాల జిల్లా యుఎస్పీసి నాయకులు అన్నారు. సెప్టెంబర్ 1న యుఎస్పీసి మహాధర్నాకు వెల్లే ముందు మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్భంగా యుఎస్పీసి నాయకులు తిరుకోవెల శ్యామ్ సుందర్, బోగ రమేష్, ఏన్నం రాంరెడ్డి, అంబటి భూమేశ్వర్, గొడుగు రఘుపతి యాదవ్, గోవర్ధన్, రాజనర్సయ్య, రాజేందర్ రెడ్డి, సుధాకర్ లు మాట్లాడుతూ పీఆర్సీ తో మధ్యంతర భృతి పై ప్రకటన లేదని, పెండింగ్ బిల్లులపై ప్రభుత్వ స్పందన కరువైందని, 317 బాధితులకు స్వంత జిల్లాలకు పంపించి న్యాయం చేయాల్సి ఉందని, కాంట్రాక్ వ్యవస్థను రద్దు చేయాలని డిమాండ్లు ఉన్నాయన్నారు. అలాగే కేజిబివి, యుఆర్ఎస్ సిబ్బందికి సమాన వేతనం కల్పించాలని, పీఎస్ లలో హెచ్ఎం పోస్టులు, పండిత, పిఈటీల సమస్యలతో ఎన్నో సమస్యలు ఉన్నాయని వీటన్నిటి సాధనే లక్ష్యంగా హైదరాబాద్ మహాధర్నా ఉంటుందని వారు పేర్కొన్నారు. 35 డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లావుడ్య రాజయ్య, కడారి ప్రకాష్, సంపత్, శ్రీనివాస్, మహేష్, సంతోష్, సిరిపురం శ్రీనివాస్, వొజ్జ శ్రీనివాస్, సత్యనారాయణ లు ఉన్నారు.