నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

ప్రజాబలం మంచిర్యాల జిల్లా ప్రతినిధి ఆగస్టు 18 : మంచిర్యాల జిల్లాలోని లక్షెట్టిపేట మండలం వెంకట్రావు పేటలో లచవ్వ అనే నిరుపేద కుటుంబానికి శ్రీ శివ సాయి గణేష్ సేవ సమితి వారి ఆధ్వర్యంలో ఇండియన్ గ్యాస్ కనెక్షన్, గ్యాస్ పొయ్యి ఇవ్వడం జరిగింది.దీనికి గాను ఖర్చు వినాయక్ రావు వారి కుమారులు రవి చరణ్ సాయి చరణ్ 5000 రూపాయల ఆర్థిక సహాయం చేశారు.శ్రీ శివ సాయి గణేష్ సేవ సమితి వారు నాలుగు నెలలు నెలకు ₹1000 చొప్పున కిరాణం సరుకు వెంకట్రావుపేట సమితి వచ్చేనెల గ్యాస్ రిఫిల్ డబ్బులు ఇస్తానని మా సమస్త కి తెలిపారు.అలాగే మరల రెండు నెలల తర్వాత గ్యాస్ రిఫిల్ మా సమితి చెల్లించడం జరుగుతుంది ఈ కార్యక్రమం శ్రీ శివసాయి గణేష్ సేవ సమితి అధ్యక్షులవారి చేతుల మీదుగా జరిగింది.ఈ కార్యక్రమంలో పాల్గొన్న సభ్యులు వినాయక రావు వారి కుమారులు,కాండ్రపు లావణ్య,శ్రీ శివ సాయి గణేష్ సేవా సమితి సభ్యులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking