ఆగష్టు 21 నుంచి స్టార్ మా లో సరికొత్త సీరియల్ “పలుకే బంగారమాయెనా”.

విలక్షణ మైన కథ తో స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతున్న “పలుకే బంగారమాయెనా”.
హైదరాబాద్ ఆగష్టు 18 ();భవిష్యత్తు ఎన్నో కలలను చూపిస్తుంది. ఎన్నో ఆశలను నేర్పిస్తుంది. ఏదో సాధించగలమన్న నమ్మకాన్ని ఇస్తుంది. ఈ కథతో స్టార్ మాప్రారంభిస్తున్న సరికొత్త సీరియల్ “పలుకే బంగారమాయెనా”. రెండు కలసి నడిచి నిజాలుగా మార్చుకున్న కథ ఇది. పుట్టుకతోపరాజితులే గానీ పట్టుదలతో ఇద్దరూ విజేతలుగా ఎలానిలబడ్డారు అనే విలక్షణ మైన కథ తో ఆగష్టు 21 నుంచి మ.1.30 గంటలకు స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది ఈ సీరియల్. గెలుపే గమ్యమైన ఇద్దరి ప్రయాణం లో ఎన్ని మలుపులు, ఎన్నిమజిలీలు వుంటాయో.. ఎన్ని అవరోధాలు, అడ్డంకులువుంటాయో చెప్పిన ఇన్స్పిరేషనల్ స్టోరీ ఇది. ఏదో సాధించాలనేతపన వున్నా తన లోపం వల్ల ఆమె ముందడుగు వేయలేనినిస్సహాయ పరిస్థితి. అయితే, ఆమె జీవితం లోకి అతని రాక ఒకమలుపు కాదు.. అనుకోని మజిలీ. అతని ప్రేమ, ప్రేరణ ఆమెఆశయాన్ని ప్రతిక్షణం కంటికి రెప్పలా కాపాడాయి. పెంచి పెద్దచేసాయి. అతని సహాయ సహకారాలు ఈ అమ్మాయి అనుకున్నఉన్నత స్థానానికి ఎలా తీసుకువెళ్లాయి అనేది “పలుకేబంగారమాయెనా” కథ. తడబడే అడుగుల నుంచి వడివడినడకలా వరకు ఒక జంట ఎంత అపురూపంగా ప్రయాణంచేసిందో అద్భుతంగా చెప్పిన ధారావాహిక స్టార్ మా ప్రేక్షకులనుఉర్రూతలూగించబోతోంది. ఓడించాలనుకున్న జీవితాన్నిగెలుచుకున్న ఆ ఇద్దరూ, వాళ్ళ కుటుంబాలు తెలుగు లోగిళ్ళలోప్రతి కుటుంబానికి నచ్చుతాయి. మిస్ అవ్వకండి

Leave A Reply

Your email address will not be published.

Breaking