వీణవంక ప్రజాబలం ప్రతినిధి సెప్టెంబర్ 6
వీణవంక మండలం పోతిరెడ్డిపల్లి (కల్లుపల్లె) గ్రామానికి చెందిన తిప్పని రాజేశ్వరి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలుపుతూ ఆమె కుమారునికి తిప్పని రమేష్ కు ఆర్థిక సహాయంగా 5,000/- ఐదువేల రూపాయలను ఫౌండర్, సీఈవో, ఎఫ్ టివి, టూరిటో పాడి ఉదయ్ నందన్ రెడ్డి అందించారు.ఈ కార్యక్రమంలో
వీణవంక మాజీ జడ్పీటీసీ దసారపు ప్రభాకర్,ఇల్లంతకుంట సర్పంచ్ సురేందర్ రెడ్డి, అమృత ప్రభాకర్, సమీండ్ల ప్రకాష్,తిప్పని సమ్మయ్య పోతిరెడ్డిపల్లి మాజీ ఉపసర్పంచ్ చేపూరి మొగిలి, మాజీ ఉపసర్పంచి తిప్పని సంతోష్ తదితరులు పాల్గొన్నారు.